- Telugu News Photo Gallery Cinema photos Super Star Mahesh Babu Creates All Time records With Guntur Kaaram First song Telugu Heroes Photos
Mahesh Babu – Guntur Kaaram: వేట మొదలెట్టిన మహేష్.. ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసిన సూపర్ స్టార్.
అప్ కమింగ్ సినిమాతో ఆల్రెడీ రికార్డ్‌ల వేట మొదలు పెట్టారు సూపర్ స్టార్ మహేష్ బాబు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న గుంటూను కారం సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది. ఇన్‌స్టాంట్‌గా వైరల్ అయిన ఈ సాంగ్ మహేష్‌కు రేర్ రికార్డ్‌ను తెచ్చిపెట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం.
Updated on: Nov 13, 2023 | 7:13 AM

అప్ కమింగ్ సినిమాతో ఆల్రెడీ రికార్డ్‌ల వేట మొదలు పెట్టారు సూపర్ స్టార్ మహేష్ బాబు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న గుంటూను కారం సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది.

ఇన్‌స్టాంట్‌గా వైరల్ అయిన ఈ సాంగ్ మహేష్‌కు రేర్ రికార్డ్‌ను తెచ్చిపెట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం.

అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఊర మాస్ గెటప్‌లో అదరగొట్టేందుకు రెడీ అవుతున్నారు సూపర్ స్టార్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌తో కంటెంట్ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.

తాజాగా ఫస్ట్ సింగల్‌తో మరోసారి సినిమా మీద అంచనాలు పీక్స్‌కు తీసుకెళ్లారు. దమ్ మసాలా అంటూ సాగే మాస్ నెంబర్‌ను రిలీజ్ చేసిన యూనిట్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేసింది.

చాలా రోజుల తరువాత సూపర్ స్టార్ నుంచి ఈ రేంజ్ మాస్ సాంగ్ వస్తుండటంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే ఫస్ట్ సింగిల్ తొలి రోజే హయ్యస్ట్ వ్యూస్‌తో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది.

24 గంటల్లో 19 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది ఈ సాంగ్. తొలి రోజు హయ్యస్ట్ వ్యూస్ సాధించిన సాంగ్స్ లిస్ట్‌లో మహేష్ పాటలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సర్కారువారి పాట సినిమాలోని పాటలు ఈ లిస్ట్‌లో ఎక్కువగా ఉన్నాయి.

సర్కారువారి పాట సినిమాలోని పెన్నీ, కళావతి, మమ మహేషా పాటలు కూడా తొలి రోజు రికార్డ్ వ్యూస్ సాధించిన పాటల లిస్ట్‌లో ఉన్నాయి. ఇలా మహేష్ మూవీస్‌లోని పాటలు వరుసగా రికార్డ్స్ తిరగరాస్తుండటంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్‌లో ఉన్నారు.




