Basha Shek |
Updated on: Dec 11, 2022 | 8:33 PM
ప్రముఖ దివంగత నటుడు అంబరీష్, సుమలతల కుమారుడు, నటుడు అభిషేక్ అంబరీష్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. తన ప్రియురాలు అబివాతో నిశ్చితార్థం చేసుకున్నాడు.
ఆదివారం (డిసెంబర్ 11) ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్లో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు.
సినిమా పరిశ్రమ నుంచి కొద్దిమంది ప్రముఖులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్, కేజీఎఫ్ ఫేమ్ హీరో యష్, మంత్రి ఆర్. అశోక్, అశ్వత్థా నారాయణ్, సుధాకర్ తదితర సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.
సుమలత అంబరీష్ తన కుమారుడి నిశ్చితార్థం గురించి రహస్యంగా ఉంచింది. ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలోకి రావడంతో అభిషేక్ ఎంగేజ్మెంట్ గురించి తెలిసింది.
Abhishek Ambareesh Engagement
ఈ వేడుకలో 'రాకింగ్ స్టార్' యష్, రాధిక పండిట్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. నిశ్చితార్థం చేసుకున్న జంటకు యశ్, రాధిక దంపతులు శుభాకాంక్షలు తెలిపారు.