- Telugu News Photo Gallery Cinema photos SSMB 29 team trying to final the title of mahesh babu upcoming movie
SSMB 29: మహేష్ సినిమాకు టైటిల్ సమస్య.. ఫైనల్ చేసే పనిలో జక్కన్న టీమ్
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసింది. ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలైన ఈ సినిమాకు సంబంధించి ఒక్క అఫీషియల్ అప్‌డేట్ కూడా రాలేదు. సినిమా ముహూర్తం షాట్‌కి సంబంధించిన పిక్ కూడా రివీల్ చేయలేదు. అయితే నెక్ట్స్ మూవీ విషయంలో జక్కన్న ఎందుకింత సీక్రసీ మెయిన్‌టైన్ చేస్తున్నారు?
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Feb 16, 2025 | 2:59 PM

గుంటూరు కారం సెట్స్ మీద ఉండగానే నెక్ట్స్ మూవీ రాజమౌళి డైరెక్షన్‌లో అంటూ క్లారిటీ ఇచ్చారు మహేష్ బాబు. జక్కన్న కూడా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మహేష్‌తోనే అని ట్రిపులార్ ప్రమోషన్స్‌లోనే ఎనౌన్స్ చేశారు.

కథ గురించి కూడా క్లారిటీ ఇచ్చినా... అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ మాత్రం ఇవ్వలేదు. జక్కన్న సైలెంట్ మోడ్ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్ ట్రెండ్ అవుతోంది.

ఈ సినిమాకు టైటిల్ విషయంలో ఇంకా క్లారిటీ రాకపోవటం వల్లే సినిమా గురించి ఎలాంటి ప్రకటనా చేయటం లేదట యూనిట్. ట్రిపులార్ షూటింగ్‌కు ముందే టైటిల్ ఫిక్స్ అయిపోవటంతో గ్రాండ్‌గా ప్రెస్‌మీట్ పెట్టి సినిమాను ఎనౌన్స్ చేశారు.

మహేష్ మూవీ విషయంలో ఇంకా టైటిల్ ఫైనల్ కాలేదు. గతంలో గరుడ, మహారాజ్ లాంటి టైటిల్స్ వినిపించినా... ఏది ఫైనల్ కాకపోవటంతో సినిమా గురించి ఎనౌన్స్‌మెంట్ ఇవ్వటం లేదేమో అన్న డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. ప్రజెంట్ షూటింగ్ చేస్తూనే టైటిల్ ఫైనల్ చేసే పనిలో ఉంది జక్కన్న టీమ్.

వన్స్ టైటిల్ ఫిక్స్ అయితే గ్రాండ్‌గా ఎనౌన్స్‌మెంట్ టీజర్‌ను రిలీజ్ చేయాలన్న ప్లాన్‌లో ఉన్నారు. అంతేకాదు ఆ టీజర్‌తో పాటు కాస్టింగ్ విషయంలోనూ ఫుల్ క్లారిటీ ఇచ్చేలా బిగ్ స్కెచ్ రెడీ చేస్తున్నారట జక్కన్న.





























