- Telugu News Photo Gallery Cinema photos Spy genre Telugu films not doing well at boxoffice, will Kalyan Ram movie Devil break it
Devil: బ్యాడ్ సెంటిమెంట్‌కు కళ్యాణ్ రామ్ డెవిల్ బ్రేక్ వేస్తారా ??
ఒకప్పుడు స్పై సినిమా అంటే ఆహా ఓహో అనేవాళ్లు.. స్క్రీన్ ప్లే కుదిర్తే బొమ్మ బ్లాక్‌బస్టర్ అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది.. స్క్రీన్ ప్లే చిరిగి బ్యాక్ ఫైర్ అవుతుంది. దాంతో స్పై డ్రామా అంటే అంత ఈజీ కాదని తెలిసిపోయింది. ఈ మధ్య వరసగా స్పై సినిమాలు బోల్తా కొడుతున్నాయి. మరి ఈ బ్యాడ్ సెంటిమెంట్‌కు కళ్యాణ్ రామ్ బ్రేక్ చెప్తారా..? ఆయన డెవిల్ ఎలా ఉండబోతుంది..? స్పై సినిమాలు చేయడం అనేది ఓ కళ. అది అందరికీ రాదు.. అందులో ఏ మాత్రం స్క్రీన్ ప్లే మిస్సైనా బ్యాక్ ఫైర్ మామూలుగా ఉండదు.
Praveen Vadla | Edited By: Phani CH
Updated on: Dec 28, 2023 | 9:01 PM

ఒకప్పుడు స్పై సినిమా అంటే ఆహా ఓహో అనేవాళ్లు.. స్క్రీన్ ప్లే కుదిర్తే బొమ్మ బ్లాక్‌బస్టర్ అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది.. స్క్రీన్ ప్లే చిరిగి బ్యాక్ ఫైర్ అవుతుంది. దాంతో స్పై డ్రామా అంటే అంత ఈజీ కాదని తెలిసిపోయింది. ఈ మధ్య వరసగా స్పై సినిమాలు బోల్తా కొడుతున్నాయి. మరి ఈ బ్యాడ్ సెంటిమెంట్‌కు కళ్యాణ్ రామ్ బ్రేక్ చెప్తారా..? ఆయన డెవిల్ ఎలా ఉండబోతుంది..?

స్పై సినిమాలు చేయడం అనేది ఓ కళ. అది అందరికీ రాదు.. అందులో ఏ మాత్రం స్క్రీన్ ప్లే మిస్సైనా బ్యాక్ ఫైర్ మామూలుగా ఉండదు. దాని రిజల్ట్ కెరీర్ అంతా వెంటాడుతుంది. కావాలంటే మహేష్ బాబు స్పైడర్‌నే తీసుకోండి.. ఈ సినిమా దెబ్బకు స్పై డ్రామా అంటేనే వద్దంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. అలాగే ఏజెంట్‌తో అఖిల్‌కు మామూలు షాక్ తగల్లేదు. ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇది.

కొన్నేళ్లుగా స్పై సినిమాలకు తెలుగులో డిమాండ్ బాగా పెరిగింది. అయితే అందులో ఎక్కువ శాతం ఫ్లాపులే ఉన్నాయి. గూడఛారి కథలు పకడ్భందీగా చెప్తే కానీ వర్కవుట్ కావు. అక్కడే పప్పులో కాలేస్తున్నారు మన మేకర్స్.

స్పైడర్, ఏజెంట్ మాత్రమే కాదు.. ఘోస్ట్, గరుడవేగ లాంటి సినిమాలు సైతం పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. కానీ గూడఛారితో అడవి శేష్, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో నవీన్ పొలిశెట్టి మాత్రం బ్లాక్‌బస్టర్ కొట్టారు.

ఆ మధ్య సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ అంటూ వచ్చిన నిఖిల్ స్పై కూడా డిజాస్టరే అయింది. ఈ టైమ్‌లో డిసెంబర్ 29న కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాతో వస్తున్నారు. 1943లో జరిగే కథ ఇది. బ్రిటీష్ సీక్రేట్ ఏజెంట్‌గా నటిస్తున్నారు కళ్యాణ్ రామ్. అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఆసక్తి ఐతే బాగానే ఉంది. మరి డెవిల్‌తో స్పై సినిమాల బ్యాడ్ సెంటిమెంట్‌కు కళ్యాణ్ రామ్ బ్రేక్ చెప్తారో లేదో చూడాలి.





























