2023 తమిళ అనువాద సినిమాలకు బాగానే కలిసొచ్చింది. సంక్రాంతికి వారసుడు.. సమ్మర్‌లో బిచ్చగాడు 2.. సెకండాఫ్‌లో జైలర్, లియో లాంటి సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. పైగా ఇందులో జైలర్ మన భోళా శంకర్‌తో పోటీపడి మరీ విజయం సాధించింది.. అలాగే వారసుడు కూడా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డికి పోటీగా బరిలోకి దిగింది.