- Telugu News Photo Gallery Cinema photos Siddu Jonnalagadda DJ Tillu to Prabhas Spirit latest Movie Updates from Telugu Film Industry
Movie Updates: రికార్డు క్రియేట్ చేసిన టిల్లుగాడు.. ప్రభాస్ స్పిరిట్ ఇప్పట్లో పట్టాలెక్కేనా.?
హేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారం సినిమా వారం రోజులు పూర్తి చేసుకుంది. జనవరి 19న వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు అతడికి మరిచిపోలేని బహుమతి ఇచ్చారు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ డీజే టిల్లు. గతేడాది కార్తీక్ రత్నం నటించిన చిత్రం లింగొచ్చా. ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా పూర్తి చేసిన తర్వాతే యానిమల్ పార్క్ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తామని ఇదివరకే చెప్పారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, యానిమల్ నిర్మాత ప్రణయ్ రెడ్డి.
Updated on: Jan 20, 2024 | 4:59 PM

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారం సినిమా వారం రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఇదిలా ఉంటే ఫస్ట్ వీక్‌లో మరే రీజినల్ సినిమాకు సాధ్యం కాని విధంగా ఏకంగా 212 కోట్లు గ్రాస్ వసూలు చేసింది గుంటూరు కారం.

జనవరి 19న వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు అతడికి మరిచిపోలేని బహుమతి ఇచ్చారు. తెలంగాణలోని సూర్యాపేటలో, అతని రాబోయే చిత్రం ఆపరేషన్ వాలెంటైన్ నుంచి వరుణ్ తేజ్ లుక్ 126 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటును ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

సిద్దు జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ డీజే టిల్లు. ఈ చిత్రం థియేటర్లలో సెన్సేషనల్ హిట్ అయింది. అలాగే డిజిటల్‌లోనూ ఆకట్టుకుంటుంది. తాజాగా ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్ ఫారం ఆహాలో ఏకంగా 500 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకుపోతుంది. ఇది నిజంగానే రికార్డ్ బ్రేకింగ్ రెస్పాన్స్.

గతేడాది కార్తీక్ రత్నం నటించిన చిత్రం లింగొచ్చా. ఆనంద్ బడా తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రంలో సుప్యర్దీ సింగ్ హీరోయిన్‍గా నటించారు. హిందూ- ముస్లిం ప్రేమకథ కావడంతో యూత్‌కు బాగానే ఆకట్టుకుంది. సంక్రాంతి సందర్భంగా ఆహాలో విడుదలైన లింగోచ్చా సినిమాకు అక్కడ్నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.

ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా పూర్తి చేసిన తర్వాతే యానిమల్ పార్క్ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తామని ఇదివరకే చెప్పారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అన్నయ్య, యానిమల్ నిర్మాత ప్రణయ్ రెడ్డి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మారిపోతున్నాయి. స్పిరిట్ కంటే ముందే యానిమల్ పార్క్ మొదలయ్యేలా కనిపిస్తుంది. ప్రభాస్ కల్కి, రాజా సాబ్ సినిమాలతో పాటు సలార్ పార్ట్2ని కూడా పూర్తి చేయాలి కాబట్టి ఈ లోపు యానిమల్ పార్క్ చేయాలని చూస్తున్నారు సందీప్.




