AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Films: ఫిల్మ్ ఛాంబర్‌కు ఈగల్ మూవీ నిర్మాతలు లెటర్.. 90స్ ప్రెస్ మీట్..

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారం సినిమా వారం రోజులు పూర్తి చేసుకుంది. సంక్రాంతి రచ్చ ఇంకా అయిపోలేదు.. ఆ మధ్య ఈగల్ సినిమా వాయిదా పడింది కదా.. కాదు కాదు అంతా కలిసి మాట్లాడుకుని వాయిదా వేయించారు. శివాజీ, వాసుకి జంటగా ఆదిత్య హాసన్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ హ్యాష్ ట్యాగ్ 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్. రాజ్ తరుణ్ చాలా రోజుల తర్వాత వరస సినిమాలు చేస్తున్నారు. ఈ రోజుల్లో పెళ్లి అనేది హీరోయిన్ల కెరీర్‌కు కామా కూడా పెట్టడం లేదు. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా వాళ్లు సినిమాలు చేస్తూనే ఉన్నారు. 

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Prudvi Battula|

Updated on: Jan 20, 2024 | 4:22 PM

Share
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారం సినిమా వారం రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. తన సినిమాకు రివ్యూస్‌తో పని లేకుండా అద్భుతమైన వసూళ్లు వస్తున్నాయని తెలిపారు వంశీ. ఫ్యామిలీ సినిమా అని ప్రమోట్ చేసుకోలేకపోవడం వల్లే కాస్త మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయన్నారు నాగవంశీ.

1 / 5
సంక్రాంతి రచ్చ ఇంకా అయిపోలేదు.. ఆ మధ్య ఈగల్ సినిమా వాయిదా పడింది కదా.. కాదు కాదు అంతా కలిసి మాట్లాడుకుని వాయిదా వేయించారు. పైగా సోలో డేట్ ఇప్పిస్తామంటూ మాటిచ్చారు. తీరా ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. దాంతో ఈగల్ నిర్మాతలు మరోసారి తమ హక్కు కోసం పోరాటం మొదలుపెట్టారు.. ఫిబ్రవరి 9న తమకు సోలో డేట్ ఇప్పించాలని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్లు ఫిల్మ్ ఛాంబర్‌కు లెటర్ రాసారు.

2 / 5
శివాజీ, వాసుకి జంటగా ఆదిత్య హాసన్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ హ్యాష్ ట్యాగ్ 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్. ప్రముఖ ఓటిటిలో జనవరి 5న విడుదలైన ఈ సిరీస్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు దర్శక నిర్మాతలు.

3 / 5
రాజ్ తరుణ్ చాలా రోజుల తర్వాత వరస సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్యే నా సామిరంగలో కీలక పాత్రలో నటించిన ఈయన.. ఇప్పుడు హీరోగా భలే ఉన్నాడే సినిమాతో వస్తున్నారు. ఇది దర్శకుడు మారుతి నిర్మాణ సంస్థలో వస్తుంది. ‘మారుతీ టీమ్ ప్రొడక్ట్’ నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న భలే ఉన్నాడే సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది.

4 / 5
ఈ రోజుల్లో పెళ్లి అనేది హీరోయిన్ల కెరీర్‌కు కామా కూడా పెట్టడం లేదు. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా వాళ్లు సినిమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా రకుల్ కూడా ఇదే చెప్పారు. ఫిబ్రవరి 22న ప్రియుడు జాకీ భగ్నానీతో ఏడడుగులు నడవబోతున్నారు రకుల్. అయితే పెళ్లి త‌ర్వాత కూడా తాను సినిమాల్లో కొన‌సాగాల‌నుకుంటున్నానని.. అంద‌రి అంగీకారంతోనే ముందుకు వెళ్తానని తెలిపారు.

5 / 5