- Telugu News Photo Gallery Cinema photos Shruti Haasan Next Movie Update she plays doctor role Telugu Actress Photos
Shruti Haasan: డాక్టర్ అవతారం ఎత్తిన శృతిహాసన్.. శృతి నెక్స్ట్ స్టెప్ ఏంటి..?
సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్న శ్రుతి హాసన్ పర్సనల్ లైఫ్ విషయంలోనూ మెచ్యూర్డ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ డాక్టర్ అవతారం ఎత్తారు. డిప్రెషన్ కారణంగా ఇబ్బంది పడుతున్న వారికి టిప్స్ ఇచ్చారు శ్రుతి. ఈ ఇయర్ సంక్రాంతికి ఆడియన్స్‌కు డబుల్ బోనాంజ ఇచ్చారు శ్రుతి హాసన్. ఒకే సీజన్‌లో ఇద్దరు టాప్ హీరోల సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చి రేర్ రికార్డ్ సెట్ చేశారు.
Updated on: Oct 18, 2023 | 5:40 PM

సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్న శ్రుతి హాసన్ పర్సనల్ లైఫ్ విషయంలోనూ మెచ్యూర్డ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ డాక్టర్ అవతారం ఎత్తారు. డిప్రెషన్ కారణంగా ఇబ్బంది పడుతున్న వారికి టిప్స్ ఇచ్చారు శ్రుతి.

ఈ ఇయర్ సంక్రాంతికి ఆడియన్స్‌కు డబుల్ బోనాంజ ఇచ్చారు శ్రుతి హాసన్. ఒకే సీజన్‌లో ఇద్దరు టాప్ హీరోల సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చి రేర్ రికార్డ్ సెట్ చేశారు. అసలు శ్రుతి ఫ్యూచర్ ఏంటి అన్న అనుమానాలు రెయిజ్ అవుతున్న నేపథ్యంలో సాలిడ్ కం బ్యాక్‌తో సత్తా చాటారు.

క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన శ్రుతి.. ఆ జోరును అలాగే కంటిన్యూ చేస్తున్నారు. వరుస ఫెయిల్యూర్స్‌తో పూజా హెగ్డే కెరీర్ గాడి తప్పటం, నార్త్ ఆశలతో రష్మిక సౌత్ సినిమాలకు దూరమవుతుండటం, సీనియర్ బ్యూటీస్ అంతా డిఫరెంట్ జానర్స్ సెలెక్ట్ చేసుకోవటంతో ఈ గ్యాప్‌లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.

అయితే అదే సమయంలో పర్సనల్ లైఫ్‌లోనూ తన మెచ్యూరిటీ లెవల్స్‌ను ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నారు. ఆల్రెడీ తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి ఓపెన్‌గా మాట్లాడుతూ ఐయామ్ సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటున్నారు.

తాజాగా మెంటల్ హెల్త్ గురించి కూడా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదన్న శృతి హాసన్, జనాలు మెంటల్ హెల్త్ విషయంలో ఎక్కువ కేర్ తీసుకోవాలంటున్నారు. రెగ్యులర్‌గా జిమ్ చేయటం, నచ్చిన వారితో మాట్లాడం లాంటివి చేస్తుంటే మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెప్పారు.

ఒకేసారి చిరు, బాలయ్య లాంటి ఇద్దరు టాప్ హీరోలతో జోడి కట్టిన ఈ బ్యూటీ.. ప్రజెంట్ సలార్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌ను టార్గెట్ చేశారు. అంతేకాదు ఓ వైపు పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే.. మీడియం రేంజ్ మూవీస్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు శ్రుతి.




