- Telugu News Photo Gallery Cinema photos Sharwanand who is busy with series of films ignoring the flops
Sharwanand: ఫ్లాపుల్లో ఉన్నా తగ్గిదేలే.. వరుస సినిమాతో బిజీగా శర్వా..
ఇండస్ట్రీలో కొందరు హీరోలున్నారు.. వాళ్లకు హిట్స్ వచ్చినా ఫ్లాపులు వచ్చినా అవకాశాలు మాత్రం ఆగవు. పైగా చిన్న బడ్జెట్ సినిమాలేం కాదు వాళ్లతో చేసేవి.. అన్నీ మంచి బడ్జెట్‌తో తెరకెక్కే సినిమాలే. అందులో శర్వానంద్ అందరికంటే ముందుంటారు. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఫ్లాపుల్లో ఉన్నా.. ఈయనకు అదెలా సాధ్యమవుతుంది..?
Updated on: Oct 20, 2024 | 6:47 AM

హిట్ వచ్చినా.. ఫ్లాప్ వచ్చినా నా జోరు మాత్రం నాదే అంటున్నారు శర్వానంద్. 2022లో ఒకే ఒక జీవితంతో హిట్ కొట్టిన తర్వాత.. రెండేళ్ళు గ్యాప్ తీసుకున్నారు. మొన్నీమధ్యే మనమే అంటూ వచ్చినా లాభం లేదు. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ చిత్రం ఆకట్టుకోలేదు. అయినా కూడా ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు శర్వానంద్.

శర్వా 35 సెట్స్‌పై ఉండగానే.. 36, 37 కూడా కన్ఫర్మ్ అయిపోయాయి. ఇక ఈ మధ్యే 38వ సినిమాను కూడా ఓకే చేసారు ఈ హీరో. సంపత్ నంది దర్శకత్వంలో ఇది తెరకెక్కుతుంది ఈ యంగ్ హిరో.

ఇదిలా ఉంటే శర్వా 36ను అభిలాష్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. ఇక సామజవరగమనా ఫేమ్ రామ్ అబ్బరాజుతో శర్వా 37 వస్తుంది. వీటి గురించి మరన్ని విషయాలు త్వరలో వెల్లడించనున్నారు.

రెండు సినిమాలు సెట్స్‌పై ఉండగానే.. సంపత్ నంది ప్రాజెక్ట్ ఓకే చేసారు శర్వా. తాజాగా ఈ చిత్ర అప్‌డేట్ వచ్చింది. 1960ల నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ సినిమా షూటింగ్ సన్నాహాలు సాగుతున్నాయి.

ఈ సినిమా కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 15 ఎకరాల స్థలంలో భారీ సెట్ నిర్మాణం జరుగుతుంది. అక్కడే మేజర్ పార్ట్ షూట్ చేయబోతున్నారు సంపత్ నంది. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతుంది.




