- Telugu News Photo Gallery Cinema photos Heroine Nabha Natesh, Pragya Jaiswal are plan with big movies in they next movies, Telugu Actress Photos
Nabha Natesh – Pragya Jaiswal: ఏంటమ్మా గ్యాప్ ఇచ్చావ్.! హీరోయిన్లకు ఎదురవుతున్న ఇదే ప్రశ్న..
ఏంటమ్మా గ్యాప్ ఇచ్చావ్.! ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లకు ఎదురవుతున్న ప్రశ్న ఇది. ఇవ్వలా వచ్చింది.. వాళ్లు చెప్తున్న సమాధానం ఇది. మరి గ్యాప్ ఇచ్చిన హీరోయిన్లెవరు.? అసలెందుకు గ్యాప్ ఇచ్చారు.? మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఏ సినిమాలతో రీ ఎంట్రీ ఇస్తున్నారు.? కొందరు హీరోయిన్లకి అందం ఉంటుంది కానీ అదృష్టం మాత్రం ఉండదు. అందుకే ఎన్ని సినిమాలు చేసినా.. మీడియం రేంజ్‌లోనే ఆగిపోతుంటారు పాపం.
Updated on: Oct 20, 2024 | 1:42 PM

ఏంటమ్మా గ్యాప్ ఇచ్చావ్.! ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లకు ఎదురవుతున్న ప్రశ్న ఇది. ఇవ్వలా వచ్చింది.. వాళ్లు చెప్తున్న సమాధానం ఇది. మరి గ్యాప్ ఇచ్చిన హీరోయిన్లెవరు..? అసలెందుకు గ్యాప్ ఇచ్చారు.?

మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఏ సినిమాలతో రీ ఎంట్రీ ఇస్తున్నారు.? కొందరు హీరోయిన్లకి అందం ఉంటుంది కానీ అదృష్టం మాత్రం ఉండదు. అందుకే ఎన్ని సినిమాలు చేసినా.. మీడియం రేంజ్‌లోనే ఆగిపోతుంటారు పాపం.

ఆ లిస్టులో ప్రగ్యా జైస్వాల్ కూడా ఉంటారు. అఖండ తర్వాత ప్రగ్య జైస్వాల్ జాతకం మారిపోతుందనుకున్నారంతా. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది ఆమె కెరీర్. బాలీవుడ్‌లోనూ టైమ్ కలిసి రావట్లేదు.

అక్కడ అక్షయ్ కుమార్‌తో నటించిన ఖేల్ ఖేల్ మే డిజాస్టర్ అయింది. కెరీర్ పూర్తిగా దారి తప్పుతున్న సమయంలో తాజాగా అఖండ 2లో మరోసారి అవకాశం ఇచ్చారు బాలయ్య. ఈ సినిమా ఓపెనింగ్ తాజాగా జరిగింది.

అఖండలో ఉన్న అన్ని కారెక్టర్స్ పార్ట్ 2లోనూ కంటిన్యూ అవుతాయని తెలుస్తుంది. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ప్రగ్యా జైస్వాల్‌తో పాటు నభా నటేష్ సైతం సెకండ్ ఇన్నింగ్స్‌లో బాగానే ఆకట్టుకుంటున్నారు.

నన్ను దోచుకుందువటే.. సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇస్మార్ట్ శంకర్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా.. అవి అంతగా వర్కవుట్ అవ్వలేదు. మూడేళ్ల కింద యాక్సిడెంట్ అవ్వడంతో.. సినిమాలకు బ్రేకిచ్చారు నభా నటేష్.

ఇన్నేళ్ళ తర్వాత వరస సినిమాలకు సైన్ చేస్తున్నారు నభా. తాజాగా నిఖిల్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ స్వయంభులో హీరోయిన్‌గా నటిస్తున్నారు. దీంతో పాటు మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. మొత్తానికి గ్యాప్ ఇచ్చినా.. భారీ ప్రాజెక్టులతోనే వస్తున్నారు నభా నటేష్, ప్రగ్యా జైస్వాల్.




