ఇవాళ్రేపు సినిమాలో సీన్ అయినా, సోషల్ మీడియాలో హాట్‌న్యూస్ అయినా స్పాట్‌లో షాట్‌గా మారిపోవడాన్ని గమనిస్తూనే ఉన్నాం. లేటెస్ట్ గా అలాంటి విషయానికి సంబంధించి వార్తల్లో ఉన్నారు శ్రీలీల. గుంటూరు కారంలో ఆమె నటనను ప్రస్తావిస్తూ ఇన్‌స్టాలో ఓ రీల్ క్రియేట్ అయింది. దాని గురించి స్పందించారు శ్రీలీల. 'దట్ వాస్ ఆన్ పర్పస్ పాపా' అంటూ శ్రీలీల రియాక్ట్ అయిన తీరుకు ఫిదా అవుతున్నారు జనాలు. అంతేకాదు, తనదైన స్టైల్‌లో ఆమె కన్నుగీటిన విధానం కేక అంటున్నారు. ఆమె చేయబోయే నెక్స్ట్ సినిమాల గురించి అభిమానుల్లోనే కాదు, ఇండస్ట్రీలోనూ ఆసక్తి క్రియేటైంది. అయితే, తాను సైన్ చేసిన సినిమాల గురించి ప్రొడక్షన్ హౌస్‌లు అధికారికంగా ప్రకటిస్తాయని, అంత వరకు ఓపిక పట్టమని రీసెంట్‌గా తిరుమల ట్రిప్‌లో చెప్పేశారు ఈ బ్యూటీ.