దీపికను పెళ్లి చేసుకోకముందు సంగతి ఎందుకుగానీ, రీసెంట్ టైమ్స్ లో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు రణ్‌వీర్‌సింగ్. మొన్నటికి మొన్ననే రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీలో ఆలియాతో కలిసి స్టెప్పులేశారు. లేటెస్ట్ గా బాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ కియారాతో జోడీ కట్టడానికి రెడీ అవుతున్నారు. హలీవుడ్‌లో బాండ్ గర్ల్స్ కి ఎంత మంచి ఇమేజ్ ఉంటుందో, మన బాలీవుడ్‌లో డాన్ గర్ల్స్ కి కూడా అంతే కరిష్మా ఉంటుంది. ఇప్పుడు డాన్ గర్ల్స్ లిస్టులో తన పేరు కూడా యాడ్ అవుతున్నందుకు కియారా ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆల్రెడీ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కియారా డాన్3లో యాక్షన్ పార్ట్ పెర్ఫార్మ్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు.