Siddu Jonnalagadda: డిజే టిల్లుతో మార్కెట్ క్రియేట్ చేసుకున్న సిద్ధూ జొన్నలగడ్డ వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన టిల్లు స్క్వేర్‌తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే తాజాగా మరో సినిమాను ప్రకటించారు సిద్ధూ. కాస్ట్యూమ్ డిజైనర్‌గా, స్టైలిస్ట్‌గా, లిరిక్ రైటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.