సల్మాన్ ఖాన్‌కు సరైన హిట్ లేక నాలుగేళ్లైంది. మొన్న సమ్మర్‌లో వచ్చిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ డిజాస్టర్ అయింది. అందుకే తాజాగా బ్లాక్‌బస్టర్ స్పై యూనివర్స్‌తో రంగంలోకి దిగుతున్నారు సల్మాన్. అదే టైగర్ 3.. యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మనీష్ శర్మ తెరకెక్కిస్తున్నారు. పఠాన్, వార్, టైగర్ జిందా హై యూనివర్స్‌లోనే టైగర్ 3 వస్తుంది.