తెలుగులో విరాటపర్వం తర్వాత సినిమానే చేయలేదు సాయిపల్లవి. ఆ తర్వాత గార్గిలో కనిపించినా, అది డబ్బింగ్ సినిమానే. 2022 తర్వాత ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే నో ఆన్సర్. పోనీ, పొరుగు భాషల్లో తీరిక లేకుండా ఉన్నారా? అంటే అలాంటిదేమీ లేదు. అక్కడా రిలీజులు కనిపించడం లేదు. ఆల్రెడీ చేస్తున్న తమిళ అమరన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. తండేల్ ఈ ఏడాది డిసెంబర్‌లో ఉంటుందా? అంటే ఇప్పటికీ డౌటే.