- Telugu News Photo Gallery Cinema photos Rumors on Allu Arjun and Atlee Movie Announcement Date and details Here Telugu Heroes Photos
Allu Arjun – Atlee: అల్లు అర్జున్, అట్లీ.. అన్నీ గాలి వార్తలే..! ఇదిగో ప్రూవ్.
అల్లు అర్జున్, అట్లీ సినిమా మీద ఇంకా అనౌన్స్‌మెంట్ కూడా రాలేదు.. అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు.. అసలు ఉంటుందా లేదా అనే క్లారిటీ కూడా లేదు. కానీ అప్పుడే సోషల్ మీడియా ఈ సినిమాతో మార్మిపోతుంది. ఒకటి రెండు కాదు.. చాలా గాసిప్స్ బన్నీ, అట్లీ సినిమాపై వస్తున్నాయి. మరి అవేంటి..? అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా..? ఉంటే ముహూర్తమెప్పుడు..? నిజంగానే కెరీర్‌లో అల్లు అర్జున్ ఇరక్కొడుతున్నారిప్పుడు.
Updated on: Mar 17, 2024 | 7:10 PM

అల్లు అర్జున్, అట్లీ సినిమా మీద ఇంకా అనౌన్స్‌మెంట్ కూడా రాలేదు.. అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు.. అసలు ఉంటుందా లేదా అనే క్లారిటీ కూడా లేదు. కానీ అప్పుడే సోషల్ మీడియా ఈ సినిమాతో మార్మిపోతుంది.

ఒకటి రెండు కాదు.. చాలా గాసిప్స్ బన్నీ, అట్లీ సినిమాపై వస్తున్నాయి. మరి అవేంటి..? అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా..? ఉంటే ముహూర్తమెప్పుడు..? నిజంగానే కెరీర్‌లో అల్లు అర్జున్ ఇరక్కొడుతున్నారిప్పుడు.

పాన్ ఇండియా స్థాయిలో రప్ఫాడిస్తున్నారు. ఈయన సినిమాల కోసం అన్ని ఇండస్ట్రీలు వేచి చూస్తున్నాయిప్పుడు. అంతా బాగానే ఉన్నా.. అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా సస్పెన్స్ మాత్రం అలాగే ఉండిపోయింది.

త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌పై ప్రకటన వచ్చినా.. అనూహ్యంగా అట్లీ లైన్‌లోకి వచ్చారు. అల్లు అర్జున్, అట్లీ సినిమాపై ఇంకా అధికారిక సమాచారం అయితే రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ప్రాజెక్ట్‌పై రోజుకో వార్త పుట్టుకొస్తుంది.

ముఖ్యంగా దీనికోసం బన్నీ 120 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుంటే.. అట్లీ 60 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. ఇప్పుడు హీరోయిన్లపై కూడా ఆసక్తికరమైన చర్చ మొదలైపోయింది.

అట్లీ సినిమాలో నిన్నటి వరకు పూజా హెగ్డే పేరు వినిపించింది. ఇప్పుడు కీర్తి సురేష్ పేరు బలంగా వినిపిస్తుంది. హిందీలో అట్లీ నిర్మిస్తున్న బేబీ జాన్‌లో కీర్తినే హీరోయిన్. కాబట్టి తెలుగులోనూ కీర్తి సురేష్‌ను తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది.

మరోవైపు ట్రెండింగ్ బ్యూటీస్ జాన్వీ కపూర్, మృణాళ్ పేర్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి అట్లీ సినిమా ఎప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజున మొదలు కానుందని తెలుస్తుంది.




