సంక్రాంతి సందడి నడుస్తుంది.. ఆ సినిమాలు ఇంకా రచ్చ చేస్తూనే ఉన్నాయి. అందుకే ఓ వారం గ్యాప్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. కానీ రిపబ్లిక్ డే వీకెండ్ మాత్రం ఎవరూ అంత ఈజీగా వదలడం లేదు. ఆ వీకెండ్ ఏకంగా 4 క్రేజీ సినిమాలు వచ్చేస్తున్నాయి. అందులో సంక్రాంతికి రావాలనుకుని ఆగిపోయిన అయలాన్, కెప్టెన్ మిల్లర్ కూడా ఉన్నాయి.