కెరీర్ మొదటి నుంచి ఎందుకో మరి మెగా ఇమేజ్‌కు కాస్త దూరంగానే ఉన్నారు వరుణ్ తేజ్. ఆ చట్రంలో పడకుండా.. అప్పుడప్పుడూ చేసిన మాస్ సినిమాలు తప్ప.. ఈయన సినిమాల్లో చాలా వరకు డిఫెరెంటే. ఫలితంతో పని లేకుండా ముకుంద, కంచె, అంతరిక్షం లాంటి భిన్నమైన సినిమాలు చేసారు వరుణ్. వీటితో పాటు ఫిదా, తొలి ప్రేమ లాంటి లవ్ స్టోరీస్‌తోనూ ఆకట్టుకున్నారీయన.