విక్రమార్కుడు సీక్వెల్ పై ఆసక్తికరమైన చర్చ.. అంత ధైర్యం చేయబోతున్న దర్శకుడు ఎవరంటే ??
రవితేజ కెరీర్‌లో ఎన్ని సినిమాలున్నా.. అదొక్కటి మాత్రం ప్రత్యేకం. ఇప్పటికీ ఆ సినిమాని చూసి మాస్ రాజా ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తుంటారు. అలాంటి సినిమా ఇంకొక్కటి పడితే బాగుంటుందని కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ కల్ట్ సినిమాకు సీక్వెల్ వస్తుందంటున్నారు. మరి అందులో నిజమెంత..? అంత ధైర్యం చేస్తున్నదెవరు..? ఇంతకీ ఏంటా కల్ట్ బ్లాక్‌బస్టర్..? రవితేజ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నారు.
Updated on: Mar 09, 2024 | 8:53 PM

రవితేజ కెరీర్‌లో ఎన్ని సినిమాలున్నా.. అదొక్కటి మాత్రం ప్రత్యేకం. ఇప్పటికీ ఆ సినిమాని చూసి మాస్ రాజా ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తుంటారు. అలాంటి సినిమా ఇంకొక్కటి పడితే బాగుంటుందని కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ కల్ట్ సినిమాకు సీక్వెల్ వస్తుందంటున్నారు. మరి అందులో నిజమెంత..? అంత ధైర్యం చేస్తున్నదెవరు..? ఇంతకీ ఏంటా కల్ట్ బ్లాక్‌బస్టర్..?

రవితేజ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ మధ్య విజయాలు అంతగా రాకపోయినా.. ఆయన దూకుడు మాత్రం తగ్గట్లేదు. ప్రస్తుతం హరీష్ శంకర్‌తో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నారు మాస్ రాజా. సమ్మర్‌లోనే విడుదల కానుంది మిస్టర్ బచ్చన్. షాక్, మిరపకాయ్ తర్వాత ఈ కాంబోలో వస్తున్న సినిమా ఇది. దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

మిస్టర్ బచ్చన్ తర్వాత అనుదీప్ కేవీ సినిమా లైన్‌లో ఉంది. ఇక రవితేజ కెరీర్ మార్చేసిన విక్రమార్కుడు సినిమాకు సీక్వెల్ రానుందనే ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై భీమా నిర్మాత కేకే రాధామోహన్ హింటిచ్చారు. విక్రమార్కుడు 2 కథ సిద్ధంగా ఉందని.. రవితేజ ఒప్పుకుంటే సంపత్ నంది దర్శకత్వంలో ఈ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారాయన.

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో `విక్రమార్కుడు` ఒకటి. మాస్ మహారాజాకి బిగ్ బ్రేక్ ఇచ్చిన మూవీలో ఒకటి. రవితేజ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇందులో రవితేజకి జోడీగా అనుష్క నటించింది. 2006లో ఈ సినిమా విడుదలై అదరగొట్టింది.

విక్రమార్కుడు సీక్వెల్ అనుకున్నంత ఈజీ కాదు. రాజమౌళి రేంజ్‌లో విక్రమ్ రాథోర్, అత్తిలి సత్తిబాబు కారెక్టర్స్ డిజైన్ చేయడం చాలా కష్టం. విజయేంద్రప్రసాద్ విక్రమార్కుడు 2 కథ సిద్ధం చేసారని చెప్పారు రాధామోహన్. కథ సిద్ధంగానే ఉన్నా.. మాస్ రాజా అంత రిస్క్ తీసుకుంటారా అనేది మెయిన్ డౌట్ ఇక్కడ. మొత్తానికి చూడాలిక.. విక్రమార్కుడు 2 వస్తుందా లేదా అనేది..!




