- Telugu News Photo Gallery Cinema photos Raashii Khanna Stunning photos goes viral telugu cinema news
Raashii Khanna: రాశీ ఖన్నాకు ఏమైంది ? ఇలా మారిపోయింది.. బక్కచిక్కిన ముద్దుగుమ్మ.. ఫోటోస్ వైరల్..
తాజాగా రాశీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. బ్యూటీ లేటేస్ట్ లుక్స్ చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్. బ్లూ కలర్ డ్రెస్ లో హోయలు పోతూ కిల్లర్ చూపులతో ఇచ్చిన ఫోజులు వైరలవుతున్నాయి. బ్లూ డ్రెస్ లో బార్పీ బొమ్మలా రెడీ అయ్యింది రాశీ.. ఒకప్పుడు బొద్దుగా ముద్దుగా కనిపించిన రాశీ ఇప్పుడు మాత్రం బక్కచిక్కిపోయి నాజూకైన అందంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో పాగా వేయడానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తుంది.
Updated on: Mar 09, 2024 | 9:04 PM

టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు రాశీ ఖన్నా. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. బొద్దుగా కనిపించి నటనతో కుర్రకారును ఫిదా చేసింది. తొలి సినిమాతోనే తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ వయ్యారి.

ఎన్నో హిట్ సినిమాల్లో నటించి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే వరుస ఆఫర్స్ అందుకున్నప్పటికీ ఈ బ్యూటీకి అంతగా స్టార్ డమ్ మాత్రం రాలేదు. ఇక ఇటీవల కొన్నాళ్లుగా తెలుగులో ఆఫర్స్ తగ్గిపోయాయి. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ అంతగా కనిపించడం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది రాశీ.

హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రా జోడిగా యోధా సినిమాలో నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. దీంతో అటు యోధా ప్రమోషన్లలో తెగ బిజీ అయిపోయింది రాశి. అయితే ఈసినిమాలో కంటే ఎక్కువగా ప్రమోషన్లలోనే సిద్ధార్థ్ తో ఎక్కువగా క్లోజ్ గా మూవ్ అవుతుంది రాశీ.

దీంతో కియారా అద్వానీ ఫ్యాన్స్ రాశీపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్స్ చేస్తూ మండిపడ్డారు. అయితే దీనిపై ఇప్పటివరకు రాశి స్పందించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా రాశీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. బ్యూటీ లేటేస్ట్ లుక్స్ చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్.

Raashii Khanna Dating

బ్లూ కలర్ డ్రెస్ లో హోయలు పోతూ కిల్లర్ చూపులతో ఇచ్చిన ఫోజులు వైరలవుతున్నాయి. బ్లూ డ్రెస్ లో బార్పీ బొమ్మలా రెడీ అయ్యింది రాశీ.. ఒకప్పుడు బొద్దుగా ముద్దుగా కనిపించిన రాశీ ఇప్పుడు మాత్రం బక్కచిక్కిపోయి నాజూకైన అందంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో పాగా వేయడానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తుంది.




