- Telugu News Photo Gallery Cinema photos Rashmika Mandanna was thought to be the first choice for Nani and Srikanth Odela film
Nani : ఏంటీ..! నాని సినిమాలో జాన్వీ కంటే ముందు ఆ స్టార్ హీరోయిన్‌ను అనుకున్నారట..కానీ
నేచురల్ స్టార్ నాని హీరోగా క్రేజీ మూవీస్ రానున్నాయి. బ్యాక్ టు బ్యాక్ దసరా, హాయ్ నాన్న సినిమాలతో హిట్స్ కొట్టాడు ఈ యంగ్ హీరో. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు.
Updated on: Jul 21, 2024 | 2:54 PM

నేచురల్ స్టార్ నాని హీరోగా క్రేజీ మూవీస్ రానున్నాయి. బ్యాక్ టు బ్యాక్ దసరా, హాయ్ నాన్న సినిమాలతో హిట్స్ కొట్టాడు ఈ యంగ్ హీరో. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతానికి వివేక్ ఆత్రేయతో కలిసి సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు. ఈ మూవీ తర్వాత దసరా దర్శకుడితో సినిమా చేస్తున్నాడు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ మూవీచేస్తున్నాడు నాని . ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో దేవర, రామ్ చరణ్ తో ఓ సినిమా చేస్తుంది జాన్వీ.. ఇప్పుడు నాని సినిమాలోనూ నటిస్తుందని టాక్.

అయితే జాన్వీ కంటే ముందు ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నను తీసుకోవాలనుకున్నారట. అయితే అనుకోని కారణాల వల్ల ఆమెను పక్కన పెట్టేశారట. గతంలో రష్మిక, నాని కాంబినేషన్ లో దేవదాసు అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే.

ఇక రష్మిక ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకుపోతుంది. పుష్ప 2 సినిమా సెట్స్ పై ఉంది. అలాగే తమిళ్ లో కొన్ని సినిమాలు, హిందీలో ఒకటి రెండు సినిమాలు చేస్తుంది. ఇటీవలే సల్మాన్ ఖాన్ మురగదాస్ సినిమాలోనూ ఛాన్స్ అందుకుందని తెలుస్తోంది.




