Devara: దేవర తొందర.. అనిరుద్ ఆలస్యం… తెగేదెప్పుడు ??
సినిమా విడుదలై పాటలు హిట్ అయ్యాక యూనిట్ అందరూ కలిసి చార్ట్ బస్టర్ సంబరాలు చేసుకుంటున్నప్పుడు అంతా హ్యాపీగానే ఉంటుంది. కానీ సినిమా రన్నింగ్‌లో ఉన్నప్పుడు మ్యూజిక్ డైరక్టర్ ట్యూన్స్ ఆలస్యం చేయడం వల్ల షెడ్యూల్స్ డిలే అవుతున్నప్పుడు కెప్టెన్ పడే పాట్లు ఎవరికి అర్థం అవుతాయి? ఇప్పుడు ఈ లైన్లు కొరటాల వింటే భలే ఖుషీ అవుతారేమో... దేవర మూవీకి సేమ్ టు సేమ్... ఆయన ఇలాంటి ఇబ్బందే ఫేస్ చేస్తున్నారన్నది ఇండస్ట్రీ టాక్.
Updated on: Jul 21, 2024 | 3:31 PM

దేవర సినిమా ఓపెనింగ్‌లో స్పెషల్ అట్రాక్షన్స్ లో అనిరుద్ అప్పియరెన్స్ కూడా ఒకటిగా నిలిచింది. ఇదే జోరుతో పాటలిచ్చేస్తే పండగ చేసుకుంటామని అనుకున్నారు ఫ్యాన్స్. మొన్నటికి మొన్న రిలీజ్ చేసిన సింగిల్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ ఎన్ని సార్లు విన్నా పెద్దగా ఎక్కలేదు ఈ పాట జనాలకు.

పోనీ నెక్స్ట్ పాటలైనా బావుంటాయా? అని అంటే... ఇప్పటిదాకా నెక్స్ట్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయం మీదే క్లారిటీ లేదు. దీనికి రీజన్ అనిరుద్ ఇంకా ట్యూన్స్ ఇవ్వకపోవడమే అనే మాట వినిపిస్తోంది.

తారక్‌లాంటి మ్యాసివ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్యాన్ ఇండియా స్టార్ సినిమాకే అనిరుద్ ఇలా చేస్తే ఎలా? తెలుగు సినిమాలంటే ఆయనకు చిన్న చూపా? లేకుంటే తెలుగు హీరోల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నారా? ఆయనతో పనిచేయించుకోవడం కొరటాలకు చేత కావడం లేదా? తెలుగు, తమిళ్ అనేతేడా లేదు... అనిరుద్ తీరే అంత.. డైరక్టర్లను తెగ తిప్పించేసుకుంటారు అంటూ గతంలో నెల్సన్ విడుదల చేసిన ప్రాంక్ వీడియో వైరల్ చేస్తున్నారు అభిమానులు.

మ్యూజిక్ డైరక్టర్ లాస్ట్ మినిట్‌లో సాంగ్స్ ఇవ్వడం వల్ల షెడ్యూల్స్ డిస్టర్బ్ కావడమే కాదు, క్రియేటివ్ ఫ్రీడమ్ కూడా దెబ్బతింటుందని, ప్రతి డిపార్ట్ మెంటూ... డెడ్‌లైన్ మీట్ కావాలనే అర్జంటులో చుట్టేసే కార్యక్రమం మొదలుపెట్టేస్తారని, దానిని వల్ల క్వాలిటీ మిస్ అవుతుందన్నది అందరిలోనూ టెన్షన్ పెంచుతున్న విషయం. ఇదే టెన్షన్ కంటిన్యూ అయితే అనిరుద్‌ని తెలుగు జనాలు... వా.. నువ్వు కావాలయ్యా అని మాత్రం అనుకోరు.