- Telugu News Photo Gallery Cinema photos Ram charan went to Australia for chief guest to indian film festival
Ramcharan: రామ్‌చరణ్ ఆస్ట్రేలియాకు ఎందుకు వెళ్తున్నారో తెలుసా ??
ఎదగడం అంటే మెట్టుకు మెట్టూ ఎక్కడమే. అలా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉన్నారు చెర్రీ. మొన్న మొన్నటిదాకా ఆయన పేరు ముందున్న మెగాపవర్‌స్టార్ స్థానంలో గ్లోబల్ స్టార్ అనే బిరుదు ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. గ్లోబల్ స్టార్ ఇమేజ్‌కి న్యాయం చేయాలని ఫిక్సయ్యారు రామ్‌చరణ్. దానికి తగ్గట్టే అడుగులేస్తున్నారు. రచ్చ సినిమా టైటిల్ సాంగ్‌ని నరనరాన ఎక్కించేసుకున్నట్టున్నారు రామ్‌చరణ్. ఆయన ప్రతి అడుగునూ జాగ్రత్తగా గమనిస్తున్న వారు ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు.
Updated on: Jul 21, 2024 | 3:41 PM

ఎదగడం అంటే మెట్టుకు మెట్టూ ఎక్కడమే. అలా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉన్నారు చెర్రీ. మొన్న మొన్నటిదాకా ఆయన పేరు ముందున్న మెగాపవర్‌స్టార్ స్థానంలో గ్లోబల్ స్టార్ అనే బిరుదు ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. గ్లోబల్ స్టార్ ఇమేజ్‌కి న్యాయం చేయాలని ఫిక్సయ్యారు రామ్‌చరణ్. దానికి తగ్గట్టే అడుగులేస్తున్నారు.

ఈ సినిమాకు సీక్వెల్ చేయమని మెగాస్టార్ స్వయంగా కోరడం కూడా ఫ్యాన్స్ కి ముచ్చటేసింది. జగదేకవీరుడు అతిలోక సుందరి సీక్వెల్‌లో రామ్‌చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తే చూడాలని ఉందని చాలా సార్లు చెప్పారు చిరు.

ట్రిపుల్ ఆర్ తర్వాత తాను గెస్ట్ రోల్ చేసిన ఆచార్య పెద్దగా ఆడకపోయినా పట్టించుకోలేదు చెర్రీ. పర్సనల్‌గా ఎన్నో విషయాలను నేర్చుకుంటూ, గేమ్‌చేంజర్ కేరక్టర్‌కి తగ్గట్టు మేకోవర్ అవుతూ, పాపతోనూ, ఫ్యామిలీ మెంబర్స్ తోనూ పర్సనల్ టైమ్‌ని ఎంజాయ్ చేస్తూ గడిపారు.

గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబు సెట్స్ కి వెళ్తారు రామ్‌చరణ్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనుంది ఈ సినిమా. ఈ చిత్రంలోనూ చెర్రీ ద్విపాత్రాభినయం చేస్తారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటిదాకా టచ్ చేయని స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కోసం ఫ్యాన్స్ కూడా ఈగర్‌గానే వెయిట్ చేస్తున్నారు.

ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు రామ్‌చరణ్. ఆరెంజ్ సినిమాలకు తన మనసులో స్పషల్ ప్లేస్ ఉంటుందని మెన్షన్ చేశారు. తన అభిమానులకు మగధీర అంటే చాలా ఇష్టమన్న విషయాన్ని కూడా గుర్తుచేసుకున్నారు రామ్‌చరణ్.




