మాస్ మహరాజ్‌తో రష్మిక.. దీపావళికి రానున్న ధృవ నక్షత్రం
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న రవితేజ, నెక్ట్స్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో మాస్ మహరాజ్‌కు జోడిగా రష్మిక మందన్న నటిస్తున్నారు. క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత రవితేజ, గోపిచంద్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఇది. మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న కన్నప్ప సినిమాకు హీరోయిన్ షాక్ ఇచ్చారు. ఇటీవల లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతిసనన్ చెల్లెలు నుపుర్ సనన్‌ను ఫైనల్ చేశారు. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవటంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని హీరో విష్ణు స్వయంగా ప్రకటించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
