- Telugu News Photo Gallery Cinema photos Ranbir Kapoor and Sandeep Reddy Vanga Movie Animal creates buzz in film industry Telugu Entertainment Photos
Ranbir Kapoor – Animal: అదిరిపోయే కట్ తో ఆకట్టుకున్న యానిమల్ టీజర్..
అర్జున్ రెడ్డి తర్వాత మరో సినిమా చేయలేదు సందీప్ రెడ్డి వంగా. కబీర్ సింగ్ చేసినా అది కూడా అర్జున్ రెడ్డే. ఒకే కథతో దేశాన్ని ఊపేసారు ఈ దర్శకుడు. మరి అలాంటి దర్శకుడి నుంచి వచ్చే రెండో సినిమాపై అంచనాలెలా ఉంటాయి..? యానిమల్‌పై ఆసక్తి అంతగా పెరగడానికి కారణం అదే. మరి ఈ చిత్ర టీజర్ ఎలా ఉంది..? అర్జున్ రెడ్డి లాటరీ కాదని సందీప్ ప్రూవ్ చేసుకుంటారా..?
Updated on: Sep 29, 2023 | 10:42 PM

అర్జున్ రెడ్డి తర్వాత మరో సినిమా చేయలేదు సందీప్ రెడ్డి వంగా. కబీర్ సింగ్ చేసినా అది కూడా అర్జున్ రెడ్డే. ఒకే కథతో దేశాన్ని ఊపేసారు ఈ దర్శకుడు. మరి అలాంటి దర్శకుడి నుంచి వచ్చే రెండో సినిమాపై అంచనాలెలా ఉంటాయి..?

యానిమల్‌పై ఆసక్తి అంతగా పెరగడానికి కారణం అదే. మరి ఈ చిత్ర టీజర్ ఎలా ఉంది..? అర్జున్ రెడ్డి లాటరీ కాదని సందీప్ ప్రూవ్ చేసుకుంటారా..? ఒక్క సినిమాతోనే ఇండియాను షేక్ చేయడం అంటే చిన్న విషయం కాదు.. కానీ చేసి చూపించారు సందీప్ రెడ్డి వంగా.

ఎలాంటి అంచనాలు లేకుండా ఈయన తెరకెక్కించిన అర్జున్ రెడ్డి పాత్ బ్రేకింగ్ మూవీగా నిలిచిపోయింది. హిందీలోనూ కబీర్ సింగ్‌గా వచ్చి 370 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఇన్నేళ్ల తర్వాత మరో కొత్త కథతో వస్తున్నారు సందీప్. అదే యానమిల్.

యానిమల్ మొదలైనప్పటి నుంచి అంచనాలు పెంచేస్తూనే ఉన్నారు సందీప్. అసలు వయోలెన్స్ అంటే ఎలా ఉంటుందో ఇండియన్ సినిమాకు చూపిస్తానంటున్నారు. అన్నట్లుగానే ప్రీ టీజర్‌తోనే రక్తం చూపించిన ఈయన..

ఇప్పుడు టీజర్‌లో ఆ డోస్ మరింత పెంచేసారు. యానిమల్ టీజర్ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా అలా పెంచేసింది.. రణ్‌బీర్ కపూర్ ఇందులో హీరో. తండ్రీ కొడుకుల ఎమోషన్‌తోనే సినిమా తెరకెక్కుతున్నా.. దాన్ని కూడా కొత్తగా చూపిస్తున్నారు సందీప్.

టీజర్ చూస్తుంటేనే సినిమాలో రక్తం ఏరులై పారుతుందని అర్థమవుతుంది. కచ్చితంగా ఇది కూడా యాక్షన్ సినిమాల్లో పాత్ బ్రేకింగ్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్. డిసెంబర్ 1న విడుదల కానుంది. మరి చూడాలిక.. యానిమల్‌తో సందీప్ ఏం మ్యాజిక్ క్రియేట్ చేస్తారో..?




