Ram Pothineni: వరుస ఫ్లోప్స్ తో ట్రెండ్ మార్చింది రాపో.. మాస్ వద్దు.. క్లాస్ ముద్దు అంటున్న రామ్..
మార్కెట్ పెంచేస్తాయి.. కెరీర్‌ను పైకి తెస్తాయని నమ్మిన మాస్ సినిమాలు వరసగా ముంచేస్తున్నాయి. దాంతో అటువైపు చూడాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు రామ్ పోతినేని. ఎనర్జీ అంతా విలన్స్‌ను కొట్టడానికే వాడేస్తుంటే.. అవేమో అస్సలు కలిసిరావట్లేదు. అందుకే కత్తులు, కటార్లు కాకుండా.. ఇకపై పూలు, అమ్మాయిల వైపు చూస్తానంటున్నారు ఈ హీరో. రామ్‌ను మరీ ఇలా మాస్‌గా చూడ్డం కంటే.. కాస్త క్లాస్‌గా చూడ్డానికే ఇష్టపడుతుంటారు అభిమానులు.