- Telugu News Photo Gallery Cinema photos Ram Charan Massages Upasana Feet On Flight While Going To Anant Ambani Radhika Marchant Pre Wedding
Ram Charan: చెర్రీకి బెస్ట్ హజ్బెండ్ అవార్డు ఇవ్వాల్సిందే.. విమానంలో ఉపాసన పాదాలకు మసాజ్ చేసిన రామ్ చరణ్
టాలీవుడ్ లో ది మోస్ట్ లవ్లీ కపుల్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే జంట రామ్ చరణ్- ఉపాసన. 2012, జూన్ 14న పెళ్లిపీటలెక్కిన ఈ మెగా కపుల్ ఎంతో అన్యోన్యంగా జీవితాన్ని గడుపుతున్నారు. వీరి ప్రేమ బంధానికి ప్రతీకగా గతేడాది క్లింకార కొణిదెల రామ్ చరణ్ ఫ్యామిలీలోకి అడుగుపెట్టింది
Updated on: Mar 03, 2024 | 5:30 PM

టాలీవుడ్ లో ది మోస్ట్ లవ్లీ కపుల్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే జంట రామ్ చరణ్- ఉపాసన. 2012, జూన్ 14న పెళ్లిపీటలెక్కిన ఈ మెగా కపుల్ ఎంతో అన్యోన్యంగా జీవితాన్ని గడుపుతున్నారు. వీరి ప్రేమ బంధానికి ప్రతీకగా గతేడాది క్లింకార కొణిదెల రామ్ చరణ్ ఫ్యామిలీలోకి అడుగుపెట్టింది

ఇక సందర్భమొచ్చినప్పుడల్లా రామ్ చరణ్ పై ప్రేమను కురిపిస్తుంటుంది ఉపాసన. ఇక తన జీవితంలో ఉపాసన ఎంత ప్రత్యేకమో చాలా సార్లు చెప్పుకొచ్చాడు చెర్రీ. తాజాగా రామ్ చరణ్, ఉపాసన ఎంత అన్యోన్యంగా ఉంటారో మరోసారి నిరూపితమైంది.

తాజాగా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి జామ్ నగర్ వెళ్లారు రామ్ చరణ్- ఉపాసన. ఇందుకోసం ఒక ప్రత్యేక విమానం ఏర్పాటుచేసుకున్నారీ లవ్లీ కపుల్. విమానంలో తన సీట్లో నిద్రించిన ఉపాసన.. తన ఎదురుగా ఉన్న రామ్‍చరణ్‍పై కాలు మోపింది. ఆ సమయంలో రామ్‍చరణ్ ఉపాసన పాదాలను మృదువుగా నొక్కుతూ మసాజ్ చేశారు.


దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన టీమ్ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. అంతే షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ వీడియో వైరల్ గా మారింది. భార్యపై అమిత ప్రేమను చూపిన రామ్ చరణ్ ను అందరూ అభినందిస్తున్నారు.

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు భార్యతో కలిసి వెళ్లారు రామ్‌చరణ్. అందులో చెప్పుకోవడానికి ఏముంది? అని అంటారా? నిజానికి విషయం అది కాదు.... వాళ్ల జర్నీలో కనిపించిన దృశ్యాల గురించే విశేషంగా మాట్లాడుకుంటున్నారు జనాలు. స్పెషల్ ఫ్లైట్‌లో ఈ వేడుకకు హాజరయ్యారు చెర్రీ దంపతులు.

ఇది కదా అన్యోన్య దాంపత్య బంధమంటే?, చెర్రీకి బెస్ట్ హజ్బెండ్ అవార్డు ఇవ్వాల్సిందే అని అభిమానులు, నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు.అలాగే తమకు ఇలాంటి భర్తే రావాలని కొందరు అమ్మాయిలు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు నెట్టంట బాగా ట్రెండ్ అవుతోంది.




