- Telugu News Photo Gallery Cinema photos Vignesh Shivan quashes divorce rumours his forst post after Nayanthara unfollows him on Instagram
నయన్, విఘ్నేష్ మధ్య విభేదాలు వచ్చాయా ?? అసలేమైందంటే ??
నయనతార, విఘ్నేష్ శివన్ మధ్య అంతా బాగానే ఉందా లేదంటే విభేదాలు ఏమైనా మొదలయ్యాయా..? ఉన్నట్లుండి ఈ అనుమానాలు ఇప్పుడెందుకు వచ్చాయి అనుకుంటున్నారు కదా..? మరి రావా.. ఇన్‌స్టాలో విఘ్నేష్‌ను నయన్ అన్‌ఫాలో కొడితే..? అవునా.. అన్ ఫాలో కొట్టిందా ఇదెప్పుడు జరిగింది అనేగా మీ డౌట్. ఆ కథ అంతా తీరిగ్గా ఈ స్టోరీలో తెలుసుకుందాం పదండి.. నయనతార విఘ్నేష్ శివన్ చాలా సంవత్సరాల పాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.
Updated on: Mar 03, 2024 | 5:02 PM

నయనతార, విఘ్నేష్ శివన్ మధ్య అంతా బాగానే ఉందా లేదంటే విభేదాలు ఏమైనా మొదలయ్యాయా..? ఉన్నట్లుండి ఈ అనుమానాలు ఇప్పుడెందుకు వచ్చాయి అనుకుంటున్నారు కదా..? మరి రావా.. ఇన్‌స్టాలో విఘ్నేష్‌ను నయన్ అన్‌ఫాలో కొడితే..? అవునా.. అన్ ఫాలో కొట్టిందా ఇదెప్పుడు జరిగింది అనేగా మీ డౌట్. ఆ కథ అంతా తీరిగ్గా ఈ స్టోరీలో తెలుసుకుందాం పదండి..

నయనతార విఘ్నేష్ శివన్ చాలా సంవత్సరాల పాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఆర్థికంగా స్థిరపడ్డ తర్వాత పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో ఆలస్యంగా నయన్ విఘ్నేష్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సరోగసి ద్వారా నయన్ తల్లయ్యారు.

ఈ పాట ఇప్పటికే నయనతార రియల్ లైఫ్‌లో రెండుసార్లు బాగా సూట్ అయింది. ఓసారి ప్రభుదేవా.. మరోసారి శింబుతో ఇలాగే పెళ్లి వరకు వచ్చిన వ్యవహారం చివర్లో ఆగిపోయింది. ఇప్పుడు హాయిగా విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకోవడమే కాదు.. కవల పిల్లలతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు నయన్. అంతలోనే విఘ్నేష్, నయన్ మధ్య విభేధాలు మొదలయ్యాయనే వార్తలొస్తున్నాయి.

ఉన్నట్లుండి నయనతార, విఘ్నేష్ మధ్య సఖ్యతపై ఇప్పుడెందుకు అనుమానం వచ్చింది అనుకోవచ్చు. కానీ నిప్పు లేనిదే పొగ రాదన్నట్లు.. ఇన్‌స్టాగ్రామ్‌లో భర్తను అన్ ఫాలో చేసారు నయన్. అంతేకాదు.. ఇన్‌స్టా స్టోరీస్‌లోనూ కన్నీళ్లు ఉబికి వస్తున్నప్పుడు కూడా.. ఇదే నాకు మిగిలిందని ఆమె చెప్పడం మానదు అనే అర్థం వచ్చేలా ఓ ఇంగ్లీష్ కొటేషన్ పోస్ట్ చేసారు నయన్.

విఘ్నేష్ శివన్‌ను అన్‌ఫాలో చేసిన కాసేపటికే మళ్లీ ఫాలో చేసారు నయన్. టెక్నికల్ రీజన్‌తోనే అన్‌ఫాలో చేసిందనుకుందాం.. మరి కన్నీళ్లు ఉబికి వస్తున్నాయనే కొటేషన్ ఎందుకు పెట్టారనేది అసలు డౌట్. గతంలో స్యామ్, నిహారిక సహా చాలా మంది సెలబ్రిటీస్ ముందు అన్‌ఫాలో చేసాకే.. విషయం తర్వాత విడాకుల వరకు వెళ్లింది. నయనతార లైఫ్ అలా కాకుంటే చాలు అంటున్నారు ఫ్యాన్స్.




