- Telugu News Photo Gallery Cinema photos Rajinikanth Jailer movie collection 525 crore in film industry Telugu Entertainment Photos
Rajinikanth – Jailer: జైలర్ కు 525 కోట్లు.! ఫస్ట్ మూవీ జైలర్.. రెండో మూవీ కూడా రజినీదే..
సక్సెస్ అంటే ఎలా ఉండాలంటే ఎప్పుడూ నెంబర్ వన్ పొజిషన్‌కి మాత్రమే పోటీ పడకూడదు. ఒన్, టూ అంటూ కౌంటింగ్ మొదలుపెడితే... మన పేరే మళ్లీ మళ్లీ వినిపించాలని అంటున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ఇప్పుడు కోలీవుడ్‌లోనే కాదు, సేమ్ ఫార్ములాని టాలీవుడ్‌లోనూ అప్లై చేస్తున్నారు తలైవర్. రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా సూపర్‌డూపర్ సక్సెస్ అయింది. 525 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని డిక్లేర్ చేసింది సన్ పిక్చర్స్.
Updated on: Aug 27, 2023 | 5:05 PM

సక్సెస్ అంటే ఎలా ఉండాలంటే ఎప్పుడూ నెంబర్ వన్ పొజిషన్‌కి మాత్రమే పోటీ పడకూడదు. ఒన్, టూ అంటూ కౌంటింగ్ మొదలుపెడితే... మన పేరే మళ్లీ మళ్లీ వినిపించాలని అంటున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ఇప్పుడు కోలీవుడ్‌లోనే కాదు, సేమ్ ఫార్ములాని టాలీవుడ్‌లోనూ అప్లై చేస్తున్నారు తలైవర్.

రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా సూపర్‌డూపర్ సక్సెస్ అయింది. 525 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని డిక్లేర్ చేసింది సన్ పిక్చర్స్. నువ్వు కావాలయ్యా అంటూ సినిమాను బంపర్ హిట్ చేశారు ఫ్యాన్స్. టాలీవుడ్‌లో టాప్ గ్రాసర్లలో సెకండ్ పొజిషన్‌లో సెటిల్ అయింది జైలర్.

కోలీవుడ్ టాప్ గ్రాసర్‌గా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది 2.0. ఈ సినిమా అక్కడ మాత్రమే కాదు, ఇక్కడ కూడా రాక్ చేసింది. తెలుగులో డబ్ అయిన తమిళ సినిమాల్లో టాప్ గ్రాసర్‌గా 2.0నే.

మొన్న మొన్నటిదాకా సెకండ్ ప్లేస్‌లో ఉంది పొన్నియిన్ సెల్వన్ ఫస్ట్ చాప్టర్. ఇప్పుడు ఆ రికార్డును కొట్టేసింది జైలర్ మూవీ. నార్త్ ట్రిప్ కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత జైలర్ టీమ్‌తో పార్టీ చేసుకున్నారు సూపర్‌స్టార్.

జైలర్ తెలుగు వెర్షన్ కూడా 75 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడున్న కలెక్షన్లు కంటిన్యూ అయితే ఇక్కడ వంద కోట్లను టచ్ చేస్తుందనే మాట కూడా వినిపిస్తోంది. ఓవరాల్ డబ్బింగ్ సినిమాల్లో తెలుగులో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న కేజీయఫ్‌ని క్రాస్ చేస్తుందని కూడా అంటున్నారు ట్రేడ్ పండిట్స్. క్లోజింగ్ కలెక్షన్లు చెక్ చేసిన తర్వాత గానీ, దీని మీద క్లారిటీ రాదు.




