Allu Arjun – Pushpa 2: నేషనల్ అవార్డుతో పుష్ప 2 పై మరింత ఉత్కంఠ.. బన్నీపై ప్రజర్.
ఇండస్ట్రీ నాకెంత బలమో, ఏదో ఒక రోజు ఇండస్ట్రీకి నేనంత బలం కావాలని అని అనుకునేవారు అల్లు అర్జున్. ఇన్నాళ్లూ ఆయన మనసులో ఉన్న మాటలకు ఇప్పుడు రూపం వచ్చింది.టాలీవుడ్ హిస్టరీలో నేషనల్ అవార్డు అందుకున్న ఫస్ట్ హీరోగా ఆయన నిజంగానే బలం చేకూరుస్తున్నారు. నేషనల్ అవార్డు అందుకున్న ఫస్ట్ టాలీవుడ్ హీరోగా సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నారు బన్నీ.