ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్ట్ 15న పుష్ప 2ను విడుదల చేయాలనేది మేకర్స్ ప్లాన్. కానీ షూటింగ్ తీరు చూస్తుంటే.. అనుకున్న తేదీకి రావడం కష్టమే అనిపిస్తుంది. ఆగస్ట్ 15కి రావడం కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు. ఇప్పటికీ ఇచ్చిన మాటపై నిలబడి.. చెప్పిన తేదికి పుష్ప 2ను తీసుకొచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు సుకుమార్.