తెలుగులో ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు రెండు సినిమాల్లో నటించింది. నాని సరసన ‘గ్యాంగ్ లీడర్’తో పాటు, శర్వానంద్ సరసన ‘శ్రీకారం’లో నటించింది. ఈ రెండు చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టకోలేకపోయాయి. అయినా ప్రియాంక మాత్రం తన ప్రయత్నాల్ని ఆపలేదు. 1994 నవంబర్ 20న జన్మించిన ఈ భామ కన్నడ తల్లికి తమిళ తండ్రికి తమిళనాడులోని మద్రాసులో పుట్టి పెరిగింది.