రుక్సార్ థిల్లర్.. ఇటీవలే నా సామిరంగ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. అక్కినేని నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా, మిర్నా నటించిన ఈ మూవీలో రుక్సార్ సైతం ఓ పాత్ర పోషించింది. 2016లో రన్ అంటోని సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది ఈ బ్యూటీ. ఆ తర్వాత 2017లో ఆకతాయి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈమూవీ ఆశించినస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి అలరించింది.