- Telugu News Photo Gallery Cinema photos Prabhas Salaar 2 movie shooting update and release date in 2025 details here Telugu Heroes Photos
Prabhas – Salaar 2: సలార్ 2 షూటింగ్ అప్పుడే స్టార్ట్.! రిలీజ్ డేట్ ఎప్పుడంటే.?
సలార్ 2 ఎప్పుడు వస్తుంది..? ప్రతీ ప్రభాస్ అభిమానికి ఉన్న కామన్ డౌట్ ఇది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ నెక్ట్స్ కమిట్‌మెంట్స్ చాలా ఉన్నాయి.. అలాగే ప్రభాస్ కోసం ముగ్గురు దర్శకులు కథలు పట్టుకుని క్యూలో ఉన్నారు. ఇలాంటి సమయంలో సలార్ 2కి టైమ్ ఇచ్చేదెప్పుడు.? అసలిది మొదలయ్యేదెప్పుడు..? రిలీజ్ అయ్యేది ఇంకెప్పుడు..? ప్రశాంత్ నీల్‌కు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా రుణపడిపోయారు. బాహుబలి తర్వాత ఆ రేంజ్ కాకపోయినా..
Updated on: Feb 03, 2024 | 9:35 PM

సలార్ 2 ఎప్పుడు వస్తుంది..? ప్రతీ ప్రభాస్ అభిమానికి ఉన్న కామన్ డౌట్ ఇది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ నెక్ట్స్ కమిట్‌మెంట్స్ చాలా ఉన్నాయి.. అలాగే ప్రభాస్ కోసం ముగ్గురు దర్శకులు కథలు పట్టుకుని క్యూలో ఉన్నారు. ఇలాంటి సమయంలో సలార్ 2కి టైమ్ ఇచ్చేదెప్పుడు.?

అసలిది మొదలయ్యేదెప్పుడు..? రిలీజ్ అయ్యేది ఇంకెప్పుడు..? ప్రశాంత్ నీల్‌కు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా రుణపడిపోయారు. బాహుబలి తర్వాత ఆ రేంజ్ కాకపోయినా.. ఆకలి మీదున్న ఫ్యాన్స్‌కు సలార్ రూపంలో మంచి హిట్టే ఇచ్చారు ప్రశాంత్ నీల్.

అందుకే పార్ట్ 2 కోసం వేచి చూస్తున్నారు వాళ్లు. అయితే ప్రభాస్ ప్రస్తుతం కల్కితో పాటు రాజా సాబ్‌తో బిజీగా ఉన్నారు. దీని తర్వాత సందీప్ వంగా స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలున్నాయి. కల్కి షూటింగ్ చివరిదశకు వచ్చేసింది.

మే 9న వచ్చినా.. రాకపోయినా అప్పటికే షూటింగ్ అయితే అయిపోతుంది. పైగా దీని టీజర్ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. హాలీవుడ్ సినిమాల టీజర్స్‌ను ప్లే చేసే సూపర్ బౌల్ ఈవెంట్‌లో కల్కి టీజర్ విడుదల చేయాలని చూస్తున్నారు.

వరల్డ్ హైయెస్ట్ వ్యూవర్ షిప్ కలిగిన ఈవెంట్ ఇది. అక్కడ కల్కి టీజర్ విడుదలైతే.. ఇండియన్ సినిమా మరో మెట్టు పైకి ఎక్కినట్లే. ఆగస్ట్‌లోపు రాజా సాబ్ కూడా పూర్తి చేయాలని చూస్తున్నారు ప్రభాస్. తాజాగా ఈ సినిమా గురించి మారుతి మాట్లాడుతూ.. వచ్చినపుడు వస్తుంది.

మనమేదీ ప్లాన్ చేయకూడదు అనేసారు. అంటే ప్రభాస్ డేట్స్ ఇచ్చినపుడే రాజా సాబ్‌కు మోక్షం వస్తుందన్నమాట. ఎలా చూసుకున్నా.. ఆగస్ట్, సెప్టెంబర్ వరకు వీటితోనే బిజీగా ఉంటారు ప్రభాస్.

నవంబర్ నుంచి సలార్ 2 మొదలు పెట్టనున్నారు. ప్రశాంత్ నీల్ కూడా సలార్ 2 కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. ఎన్టీఆర్‌తో సినిమా ప్లాన్ చేసినా.. దేవర పోస్ట్ పోన్ అవుతుండటంతో నవంబర్ నుంచి సలార్ 2 మొదలు పెట్టాలని చూస్తున్నారు నీల్.

2025 దసరాకు సలార్ 2ను విడుదల చేయాలనేది ప్రశాంత్ నీల్ ప్లాన్. అదే జరిగితే.. దేవర తర్వాత తారక్ కూడా ఇమ్మీడియట్‌గా దేవర 2 చేస్తారు.. ఆ తర్వాతే ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమా మొదలవుతుంది.




