- Telugu News Photo Gallery Cinema photos Pawan Kalyans og and hari hara veeramallu shooting and releasing date updates
Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు ఒక గుడ్ న్యూస్.. ఒక బ్యాడ్ న్యూస్
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నింటికీ అలవాటు పడిపోయారు. సినిమా వస్తుందంటే ఆనందం లేదు.. రావట్లేదంటే బాధ లేదు. వచ్చినపుడు చూసుకుందాం.. రాకపోతే సర్దుకుందాం అన్నట్లు తయారైపోయారు వాళ్లు. ఇలాంటి సమయంలో ఒక గుడ్ న్యూస్.. ఓ బ్యాడ్ న్యూస్ వాళ్ల కోసం ఎదురు చూస్తుంది. మరి ఆ న్యూస్‌లేంటో ఓసారి చూద్దామా..?
Updated on: May 05, 2025 | 7:20 PM

పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఎదురు చూడటమే మానేసారు ఫ్యాన్స్. వచ్చినపుడు వస్తాయిలే.. అప్పటి వరకు రీ రిలీజ్‌లతో సర్దుకుపోదాం అంటున్నారు. హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ మొదలైందిప్పుడు.

పవన్ కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఈ 2 రోజుల షూటింగ్‌తో సినిమా అంతా పూర్తైపోతుంది. త్వరలోనే ట్రైలర్ అప్‌డేట్ ఇస్తామని చెప్పారు నిర్మాతలు.

మే 9న విడుదల చేస్తామంటూ నిర్మాతలు అనుకుంటే సరిపోదు.. పవన్ కూడా అనుకోవాలి కదా..? ఆయనున్న బిజీకి అనుకోలేదు.. దాంతో మరోసారి వాయిదా తప్పలేదు. నెక్ట్స్ షెడ్యూల్‌లో పవన్ పార్ట్ పూర్తి చేసి.. వీలైనంత త్వరగా సినిమా విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.

మరోవైపు ఫ్యాన్స్ కలలు కంటున్న ఓజికి మాత్రం ఇంకా టైమ్ పట్టేలా ఉంది. ఓజి షూటింగ్ చాలా వరకు పూర్తైందని అనుకుంటున్నారంతా. కానీ తాజాగా ఇమ్రాన్ హష్మీ ఇచ్చిన అప్‌డేట్‌తో పవన్ ఫ్యాన్స్ కళ్లు బైర్లు గమ్మేసాయి.

ఇప్పటి వరకు పవన్‌తో కాంబినేషన్ సీన్స్ షూటే చేయలేదని చెప్పారు ఈ నటుడు. మరో 2, 3 నెలల్లో షూట్ చేస్తామంటున్నారీయన. ఈ లెక్కన ఓజి ఇప్పట్లో రానట్లే. పోనీలే ఓజి రాకపోయినా.. వీరమల్లు వస్తే అదే పదివేలు అంటున్నారు ఫ్యాన్స్.




