Nayanthara: ఆస్తులు అడుగుతున్న స్టార్ హీరోయిన్.. భయపడుతున్న నిర్మాతలు
బేసిక్‌గా నయనతార అంటేనే భయపడుతుంటారు నిర్మాతలు. ఆమెతో సినిమా అంటే అమ్మో అనుకునే వాళ్లే ఎక్కువ. యాక్టింగ్ పరంగా అదరగొట్టినా.. రెమ్యునరేషన్‌తో చుక్కలు చూపించడం నయన్ స్పెషాలిటీ. ఇప్పుడూ ఇదే జరుగుతుంది. 40 ప్లస్‌లోనూ ఈమె తగ్గేదే లే అంటున్నారు. తాజాగా ఓ సినిమా కోసం రికార్డ్ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు ఈ భామ.
Updated on: May 05, 2025 | 7:13 PM

40 ఏళ్లలోనూ నెంబర్ వన్ హీరోయిన్‌గా ఉండటం అనేది చిన్న విషయం కాదు.. కానీ తనకు ఇవన్నీ మామూలే అంటున్నారు నయనతార. ఈ భామ దూకుడు ముందు కుర్ర హీరోయిన్లు కూడా నిలబడలేకపోతున్నారు.

ఈ రోజుకు కూడా ఒక్కో సినిమాకు 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటూ.. చాలా మంది హీరోయిన్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు నయన్. జవాన్ తర్వాత ఈమె రేంజ్ ఇంకా పెరిగిపోయింది.

20 ఏళ్లుగా సౌత్ సినిమాల్లోనే నటించిన నయన్.. ఇక్కడే రికార్డ్ రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇప్పటికీ సినిమాకు 8 నుంచి 10 కోట్ల వరకు తీసుకుంటున్న ఈ బ్యూటీ.. ప్రమోషన్‌కు కూడా రానని ముందే చెప్తుంటారు.

ఇన్ని కండీషన్స్ పెట్టినా.. ఆమె క్రేజ్ ముందు అన్నీ చెల్లుతున్నాయి. జవాన్ తర్వాత బాలీవుడ్‌లోనూ ఈమెకు మార్కెట్ పెరిగింది. తాజాగా సినిమాకు 15 కోట్లు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది. చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా కోసం నయనతార పేరును పరిశీలిస్తున్నారు మేకర్స్.

అయితే ఈ సినిమా కోసం 18 కోట్ల వరకు నయన్ రెమ్యునరేషన్ అడిగినట్లు తెలుస్తుంది. గతంలో చిరుతో కలిసి సైరా, గాడ్ ఫాదర్‌లలో నటించారు నయన్. ముచ్చటగా మూడోసారి చిరుతో నటించడానికి చుక్కలు చూపించే పారితోషికం డిమాండ్ చేస్తున్నారీమే. మరి ఈ కాంబో కలుస్తుందా లేదా చూడాలిక.




