- Telugu News Photo Gallery Cinema photos Pawan kalyan Hari Hara Veer Mallu latest update now trending on 11 07 2025
Hari Hara Veer Mallu: ఒక్కో అప్‌డేట్‌తో అంచనాలు పెంచేస్తున్న హరి హర వీరమల్లు..
హరి హర వీరమల్లు రిలీజ్‌కు రెండు వారాలే టైముంది. ఆల్రెడీ ప్రమోషన్ స్పీడు పెంచింది మూవీటీమ్. ఒక్కో అప్‌డేట్‌తో అభిమానుల్లో అంచనాలు పెంచేస్తోంది. మరి పవన్ తొలి పాన్ ఇండియా సినిమాకు ఈ బజ్ సరిపోతుందా..? అసలు ఆడియన్స్‌లో వీరమల్లు మీద అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయి..? ఈ స్టోరీలో చూద్దాం. మోస్ట్ అవెయిటెడ్ హరి హర వీరమల్లు జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Updated on: Jul 11, 2025 | 9:53 PM

మోస్ట్ అవెయిటెడ్ హరి హర వీరమల్లు జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ ప్రమోషన్ స్పీడు పెంచారు మేకర్స్. రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్ తరువాత వీరమల్లు మీద అంచనాలు డబుల్ అయ్యాయి.

ఒక్కసారిగా ఆడియన్స్‌లో పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది. ఈ జోష్‌తో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇప్పటికే పొలిటికల్ విక్టరీతో నేషనల్ లెవల్‌లో న్యూస్ మేకర్ అయ్యారు పవన్, ఇప్పుడు పవన్ తొలి పాన్ ఇండియా సినిమా కూడా అదే రేంజ్‌లో బజ్ క్రియేట్ చేయటం పక్కా అంటున్నారు పవర్ స్టార్ అభిమానులు.

దీనికి తోడు వరుస అప్‌డేట్స్ సినిమా మీద అంచనాలను మరింత పెంచేస్తున్నాయి.ఇండియన్ స్క్రీన్ మీద భారీ పాన్ ఇండియా మూవీ రిలీజ్ అయి చాలా కాలం అవుతోంది.

అది కూడా వీరమల్లుకు కలిసొచ్చే అంశమే అంటున్నారు క్రిటిక్స్. ఈ సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా... బాక్సాఫీస్ రికార్డులు తారుమారు కావటం పక్కా అని అంచనా వేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన న్యూస్ వీరమల్లుని నేషనల్ హెడ్‌లైన్స్‌లో ఉండేలా చేస్తోంది.

భారీగా ప్లాన్ చేస్తున్న ఈ ఈవెంట్‌కు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారన్న వార్త కూడా టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇలా అన్ని పాజిటివ్ సైన్స్‌తో ఫ్యాన్స్‌లో మరింత హైప్ పెంచేస్తున్న వీరమల్లు... ఆఫ్టర్ రిలీజ్ ఇదే జోరు కంటిన్యూ చేస్తారేమో చూడాలి.




