పాకిస్తాన్‌లో పాగా వేస్తున్న తెలుగు హీరోలు.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న పాక్ మీడియా
మన హీరోల గురించి మన దేశంలో మాట్లాడుకుంటే కిక్ ఏముంటుంది చెప్పండి..? అదే పక్కనున్న పాకిస్తాన్‌లోనూ మన తెలుగు హీరోల గురించి చర్చ నడిస్తే అప్పుడు కదా అసలు కిక్. ఇప్పుడు ఇలాంటి కిక్కే వచ్చింది. మన స్టార్స్ గురించి దాయాది దేశంలోనూ చర్చ జరుగుతుంది. తాజాగా రామ్ చరణ్‌పై పాకిస్తానీలు ప్రశంసలు కురిపించారు. మరి ఆ ముచ్చట్లేంటో చూద్దామా..? రాజమౌళి కారణంగా పాకిస్తాన్‌లోనూ మన సినిమాలకు క్రేజ్ బాగా పెరిగింది.