- Telugu News Photo Gallery Cinema photos Sekhar Kammula making mass and sentiment movie Kubera with Dhanush, will be a boxoffice hit
Dhanush: ధనుష్ కోసం సేఫ్ జోన్ దాటేస్తున్న శేఖర్ కమ్ముల.. మరి ఇండస్ట్రీ హిట్ దక్కేనా ??
ధనుష్‌కు కథ చెప్పడం.. సినిమా పట్టాలెక్కించడం.. నాగార్జున కీలక పాత్ర చేస్తుండటం.. ఇలా శేఖర్ కమ్ముల సినిమాలకు అన్నీ శుభ శకునాలే కనిపిస్తున్నాయి. కానీ కంటికి కనిపించని ఓ కష్టం కూడా ఈ కాంబినేషన్‌ను ఫాలో చేస్తుంది. దాన్ని దాటితే గానీ శేఖర్ కమ్ముల కలలు కంటున్న పాన్ ఇండియన్ హిట్ రాదు. మరి ఏంటా కష్టం..? దానికోసం కమ్ముల ఏం చేయాలి..? శేఖర్ కమ్ముల సినిమా అంటే మనకు ముందుగా ఇదిగో ఇలాంటి ప్రేమకథలే గుర్తుకొస్తుంటాయి.
Updated on: Mar 11, 2024 | 8:07 PM

ధనుష్‌కు కథ చెప్పడం.. సినిమా పట్టాలెక్కించడం.. నాగార్జున కీలక పాత్ర చేస్తుండటం.. ఇలా శేఖర్ కమ్ముల సినిమాలకు అన్నీ శుభ శకునాలే కనిపిస్తున్నాయి. కానీ కంటికి కనిపించని ఓ కష్టం కూడా ఈ కాంబినేషన్‌ను ఫాలో చేస్తుంది. దాన్ని దాటితే గానీ శేఖర్ కమ్ముల కలలు కంటున్న పాన్ ఇండియన్ హిట్ రాదు. మరి ఏంటా కష్టం..? దానికోసం కమ్ముల ఏం చేయాలి..?

శేఖర్ కమ్ముల సినిమా అంటే మనకు ముందుగా ఇదిగో ఇలాంటి ప్రేమకథలే గుర్తుకొస్తుంటాయి. మంచి కాఫీ లాంటి సినిమా అంటూ ఇండస్ట్రీకి వచ్చిన ఈయన.. అప్పట్నుంచి తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. మధ్య మధ్యలో లీడర్, అనామిక అంటూ ప్రయోగాలు చేసినా.. శేఖర్ కమ్ముల బలం మాత్రం క్లాస్ సినిమాలే.

కానీ ఇప్పుడు ధనుష్ కోసం తన సేఫ్ జోన్ దాటేస్తున్నారీయన. ధనుష్ లాంటి హీరో డేట్స్ ఇచ్చినపుడు.. ఎలాంటి దర్శకుడైనా ఆయన్ని ఫుల్లుగా వాడేయాలని ఫిక్సైపోతారు. శేఖర్ కమ్ముల కూడా దీనికి మినహాయింపేమీ కాదు. తాజాగా విడుదలైన కుబేరా ఫస్ట్ లుక్ చూస్తుంటే ఈ విషయం అర్థమైపోతుంది.

గోడపై శివుడు, అన్నపూర్ణ దేవి.. వాళ్ల ముందు పేదోడిలా ఉన్న ధనుష్ ఇవన్నీ కుబేరాపై ఆసక్తి పెంచేస్తున్నాయి. ధనుష్‌తో ఇలాంటి సినిమా చేసి మెప్పించడం శేఖర్ కమ్ముల ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. ఎందుకంటే తమిళంలో ఈ తరహా పాత్రలు ఇప్పటికే చాలా చేసారు ధనుష్. వాళ్లకు ఇవేం కొత్త కాదు.

వాళ్ల అంచనాలను మించి ఉంటే తప్ప కుబేరా గెలుపు తలుపు తీయడం కష్టమే. మొత్తానికి మరి చూడాలిక.. శేఖర్ కమ్ముల ఈ టాస్క్ ఎలా పూర్తి చేస్తారో..? అన్నట్లు.. నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్.




