- Telugu News Photo Gallery Cinema photos Once again Selvaraghavan who will get a mega phone and will travel with the Movie sequels
Selva Raghavan: మరోసారి మెగా ఫోన్ పట్టనున్న సెల్వ.. సీక్వెల్స్ తోనే ప్రయాణం..
ఓ వైపు నటుడిగా ఫుల్ బిజీగా ఉంటూనే దర్శకుడిగానూ వరుస సినిమాలు చేస్తున్నారు సెల్వ రాఘవన్. 7జీ బృందావన్ కాలనీ, ఆడువారి మాటలకు అర్ధాలె వేరులే లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఈ క్రేజీ డైరెక్టర్, వరుసగా హ్యాట్రిక్ సీక్వెల్స్‌ను లైన్‌లో పెట్టారు. 7బై జీ బృందావన్ కాలనీ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు సెల్వ రాఘవన్.
Updated on: Feb 12, 2024 | 4:36 PM

ఓ వైపు నటుడిగా ఫుల్ బిజీగా ఉంటూనే దర్శకుడిగానూ వరుస సినిమాలు చేస్తున్నారు సెల్వ రాఘవన్. 7జీ బృందావన్ కాలనీ, ఆడువారి మాటలకు అర్ధాలె వేరులే లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఈ క్రేజీ డైరెక్టర్, వరుసగా హ్యాట్రిక్ సీక్వెల్స్‌ను లైన్‌లో పెట్టారు.

7బై జీ బృందావన్ కాలనీ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు సెల్వ రాఘవన్. రెగ్యులర్ కమర్షియల్ ట్రెండ్‌కు భిన్నంగా సినిమాలు చేసే ఈ క్రేజీ డైరెక్టర్‌కు తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే డైరెక్టర్‌గా సెల్వ నుంచి నెక్ట్స్ మూవీ ఎప్పుడు వస్తుందా అని టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం నటుడిగా ఫుల్ బిజీగా ఉన్న సెల్వ రాఘవన్, రీసెంట్‌గా 7 బై జీ బృందావన్ కాలనీ సినిమాకు సీక్వెల్‌ను లైన్‌లో పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో షూటింగ్ కూడా స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ధనుష్ హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన పుధుపేట్టై సినిమాకు కూడా సీక్వెల్ రెడీ అవుతోంది. 2006లో రిలీజ్ అయిన ఈ సినిమా ధనుష్‌కు స్టార్ స్టేటస్ తెచ్చి పెట్టింది. అందుకే మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

సెల్వ రాఘవన్ కెరీర్‌లో మైల్ స్టోన్‌గా నిలిచిన మూవీ యుగానికి ఒక్కడు. ఈ సినిమాకు కూడా సీక్వెల్‌ను రూపొందించే పనిలో ఉంది సెల్వ టీమ్. మూడేళ్ల క్రితమే సీక్వెల్‌కు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చిన మేకర్స్. లైన్‌లో ఉన్న సినిమాలు పూర్తయిన వెంటనే యుగానికి ఒక్కడు సీక్వెల్ పనులు స్టార్ట్ చేస్తారు.




