AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

South Movies: నార్త్ బ్యాక్‌డ్రాప్‌లోనే ప్లాన్.. పాన్ ఇండియా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా..

ఆల్రెడీ వెండితెర మీద లాంగ్వేజ్ బారియర్స్ చెరిగిపోయాయి. దీంతో ప్రతీ సినిమా సౌత్‌ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల రిలీజ్ అవుతున్నాయి. అందుకే పాన్ ఇండియా కనెక్ట్ ఉండేందుకు సౌత్ సినిమాలను కూడా నార్త్ బ్యాక్‌డ్రాప్‌లోనే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అలా ఉత్తరాది కథలతో వస్తున్న ఈ సినిమాలు ఈ మధ్య సౌత్‌ స్క్రీన్ మీద ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Prudvi Battula|

Updated on: Feb 12, 2024 | 4:20 PM

Share
నాని హీరోగా తెరకెక్కిన రీసెంట్‌ మూవీ హాయ్ నాన్న. రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కథ ఎక్కువ భాగం ముంబై నేపథ్యంలోనే సాగుతుంది. షూటింగ్ కూడా చాలా వరకు అక్కడే చేసింది యూనిట్‌. నేపథ్యం ఉత్తరాది అయినా, మన ఆడియన్స్‌కు కూడా బాగా కనెక్ట్ అయ్యింది హాయ్‌ నాన్న.

1 / 5
పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్‌ కూడా ముంబై నేపథ్యంలోనే సాగుతుంది. అందుకే షూటింగ్ అంతా అక్కడే చేస్తోంది మూవీ టీమ్‌. నార్త్ బ్యాక్ డ్రాప్‌ మాత్రమే కాదు సంజయ్ దత్‌ లాంటి నార్త్ ఆర్టిస్ట్‌లు కూడా ఈ సినిమాలో చాలా మంది నటిస్తున్నారు.

2 / 5
శుక్రవారం ఆడియన్స్‌ ముందుకు వచ్చిన లాల్‌ సలాం సినిమా కూడా ముంబై నేపథ్యంలోనే తెరకెక్కింది. స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ముంబై డాన్‌ మొయిద్దీన్‌ భాయ్‌గా కనిపించారు రజనీకాంత్‌. రెండు వర్గాలకు చెందిన క్రికెటర్ల మధ్య జరిగిన గొడవను భాయ్‌ ఎలా పరిష్కరించారు అన్నదే ఈ సినిమా కథ.

3 / 5
సౌత్‌లో ఫీల్ గుడ్ సినిమాలు తెరకెక్కించిన శేఖర్ కమ్ముల కూడా కథా నేపథ్యాన్ని ముంబైకి మార్చేశారు. ధనుష్‌, నాగార్జున కాంబినేషన్‌లో రూపొందిస్తున్న సినిమాకు నార్త్‌ బ్యాక్‌డ్రాప్‌ సెట్‌ చేశారు. మాఫియా కథ కావటంతో ముంబై బ్యాక్‌ డ్రాప్ పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యారట శేఖర్ కమ్ముల. ఈ సినిమాకు ధారావి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారన్న టాక్‌ కూడా వినిపిస్తోంది.

4 / 5
దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా లక్కీ భాస్కర్‌. ఫినాన్షియల్‌ క్రైమ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కథ కూడా ముంబైలోనే జరుగుతుంది. ఇలా సౌత్ సినిమాల్లో చాలా వరకు ముంబై నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో మన స్టార్స్ ఎక్కువగా అక్కడే గడిపేస్తున్నారు.

5 / 5