- Telugu News Photo Gallery Cinema photos OMG 2 Movie takes Bollywood Hero Akshay Kumar into hit track Again
Akshay Kumar: వరుస ఫెయిల్యూర్స్‌తో అక్షయ్.. ఈ చిత్రంతో మళ్లీ హిట్ ట్రాక్‌లోకి..
హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. తన విషయంలో వినిపిస్తున్న కంప్లయింట్స్‌ను కూడా పట్టించుకోకుండా సినిమాలు కమిట్ అవుతున్నారు. ప్రజెంట్ ఈ ఖిలాడీ స్టార్ కిట్టీలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్‌లో మిస్టర్ డిపెండబుల్ అన్న రేంజ్‌లో ఫామ్ చూపించిన అక్షయ్ కుమార్ ఇప్పుడు వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో పడ్డారు. కమర్షియల్ సినిమా, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ఫ్యామిలీ డ్రామా, హిస్టరికల్ మూవీ ఇలా అక్షయ్ కాంపౌండ్ నుంచి ఏ సినిమా వచ్చినా రిజల్ట్ మాత్రం సేమ్.
Updated on: Sep 15, 2023 | 11:58 AM

హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. తన విషయంలో వినిపిస్తున్న కంప్లయింట్స్‌ను కూడా పట్టించుకోకుండా సినిమాలు కమిట్ అవుతున్నారు. ప్రజెంట్ ఈ ఖిలాడీ స్టార్ కిట్టీలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి.

ఒకప్పుడు బాలీవుడ్‌లో మిస్టర్ డిపెండబుల్ అన్న రేంజ్‌లో ఫామ్ చూపించిన అక్షయ్ కుమార్ ఇప్పుడు వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో పడ్డారు. కమర్షియల్ సినిమా, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ఫ్యామిలీ డ్రామా, హిస్టరికల్ మూవీ ఇలా అక్షయ్ కాంపౌండ్ నుంచి ఏ సినిమా వచ్చినా రిజల్ట్ మాత్రం సేమ్. దీంతో అక్షయ్ కాస్త బ్రేక్ తీసుకుంటే బెటర్ అని ఫీల్ అయ్యారు ఆడియన్స్.

ఈ వరుస ఫ్లాప్‌లకు ఓ కాంట్రవర్షియల్ సినిమాతో బ్రేక్ పడింది. ఓ మైగాడ్ 2తో మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వచ్చారు అక్షయ్. దీంతో ఖిలాడీ హీరో అప్‌కమింగ్ సినిమాల విషయంలో పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది. గతంలో ఆగిపోయిన అక్షయ్ సినిమాల్లోనూ ఇప్పుడు కదలిక కనిపిస్తోంది.

ప్రజెంట్ బడే మియా చోటే మియా, వెల్ కం 3, మిషన్ రాణీగంజ్, సూరారైపోట్రు రీమేక్ షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు అక్షయ్ కుమార్. మరో మూడు సినిమాలు ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్నాయి. ప్రజెంట్ అక్షయ్ కూడా ఫామ్‌లోకి రావటంతో ఈ సినిమాల మేకర్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

అయితో ఓ మైగాడ్ 2 సక్సెస్ క్రెడిట్ పూర్తిగా అక్షయ్ ఖాతాలోకి అయితే రాలేదు. ఈ సినిమా విషయంలో కాంట్రవర్సీలు కూడా హెల్ప్ అయ్యాయన్న టాక్ ఉంది. అందుకే అక్కీ అప్ కమింగ్ సినిమాల రిజల్ట్ మీద కూడా ఫోకస్ కాస్త గట్టిగానే కనిపిస్తోంది.




