- Telugu News Photo Gallery Cinema photos Sreeleela upcoming movies and project updates full details here Telugu Actress Photos
Sreeleela: క్రేజ్‌తో పాటు రెమ్యూనరేషన్ కూడా హైక్.. ట్రెండింగ్ లో కేజ్రీ హీరోయిన్ శ్రీలీల.
శ్రీలీల.. టాలీవుడ్‌లో ప్రస్తుతం ఈ హీరోయిన్ పేరు విపరీతంగా మారుమ్రోగుతోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన 'పెళ్లిసందD'తో తెలుగు తెరకు పరిచయమైంది కన్నడ బ్యూటీ శ్రీలీల. మొదటి చిత్రంలో తన అందచందాలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకోవడమే కాకుండా.. పక్కింటి అమ్మాయిలా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. అంతే! ఇంకేముంది ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు వచ్చిపడ్డాయి.
Updated on: Sep 15, 2023 | 12:16 PM

శ్రీలీల.. టాలీవుడ్‌లో ప్రస్తుతం ఈ హీరోయిన్ పేరు విపరీతంగా మారుమ్రోగుతోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన 'పెళ్లిసందD'తో తెలుగు తెరకు పరిచయమైంది కన్నడ బ్యూటీ శ్రీలీల.

మొదటి చిత్రంలో తన అందచందాలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకోవడమే కాకుండా.. పక్కింటి అమ్మాయిలా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. అంతే! ఇంకేముంది ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు వచ్చిపడ్డాయి.

కేవలం ఏడాదిలోనే తెలుగులో బంపర్ ఛాన్స్‌లు పట్టేసింది. అటు సీనియర్ హీరోలు, ఇటు యంగ్ హీరోలు కలిపి ఏకంగా ప్రస్తుతం 9 చిత్రాల్లో నటిస్తోంది శ్రీలీల. ఈ అన్ని సినిమాల్లోనూ ఆమె కీలక పాత్రల్లో నటిస్తోంది.

మరోవైపు శ్రీలీల క్రేజ్‌తో పాటు రెమ్యూనరేషన్ కూడా సినిమా.. సినిమాకు పెరుగుతూపోతోంది. పెళ్లిసందD చిత్రానికి రూ. 5 లక్షల పారితోషికం తీసుకున్న శ్రీలీల.. ఆ తర్వాత రవితేజతో నటించిన ధమాకాకు రూ. 50 లక్షలు తీసుకుందట. ఇక రామ్ సరసన నటించిన 'స్కందా' చిత్రానికి రూ. 80 లక్షల నుంచి రూ. కోటి వరకు పారితోషికం తీసుకున్నట్టు టాక్.

అలాగే ఆమె ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాలకు రూ. 5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. సినిమాలు మాత్రమే కాదు.. అటు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌కు కూడా విచ్చేస్తూ.. భారీగా పారితోషికాలు తీసుకుంటోంది.

కాగా, శ్రీలీల ప్రస్తుతం రామ్‌తో 'స్కంద'.. బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న 'భగవంత్ కేసరి'లో కీలక పాత్ర, పంజా వైష్ణవ్ తేజ్‌తో 'ఆదికేశవ్', నితిన్‌తో 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్', మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'గుంటూరు కారం'.. అలాగే విజయ్ దేవరకొండ ఓ చిత్రంలో, పవన్ కళ్యాణ్ సరసన 'ఉస్తాద్ భగత్ సింగ్'లో.. 'అనగనగ ఒక రోజు' చిత్రాల్లో నటిస్తోంది..




