Iswarya Menon: అన్నానికి బదులు అందంగాని తింటుందో ఏమో ఈ భామ.. ట్రెండీ డ్రెస్ లో సెగలు పుట్టిస్తున్న ఐశ్వర్య..
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కిన 'స్పై' మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది మలయాళీ ముద్దుగుమ్మ ఐశ్వర్య మీనన్. తమిళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య.. ఈ మూవీతో తెలుగులోనూ మంచి మార్కులు కొట్టేసింది. ఇంజినీరింగ్ విద్య చదివిన ఐశ్వర్య మీనన్.. అనుకోకుండా హీరోయిన్‌గా మారింది. కాలేజీ డేస్‌లో పలు యాడ్ ఫిలిమ్స్‌లో నటించిన ఐశ్వర్యకు.. హీరోయిన్ అవకాశాలు వరుసగా తలుపు తట్టాయి. 2012లో 'కదలిల్ సోధప్పువదు ఎప్పడి' అనే చిత్రంతో తమిళ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా పరిచయమైంది ఐశ్వర్య మీనన్.