- Telugu News Photo Gallery Cinema photos North heroes ready to do films under south directors for success
South Directors: నార్త్ హీరోల ఫోకస్ అంత సౌత్ కెప్టెన్స్ పైనే.. ఇదే బాలీవుడ్ కొత్త సక్సస్ ఫార్ములా..
Updated on: Dec 04, 2023 | 12:32 PM

తెలుగులో అర్జున్‌రెడ్డి హిట్ టాక్‌తో హిందీలో కబీర్ సింగ్ ఆడిందా? అంటూ మొన్న మొన్నటివరకు వినిపించిన మాటకు ఇప్పుడు ఫుల్‌స్టాప్ పడింది. రిలీజ్ డే టాక్‌తో సంబంధం లేకుండా 350 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది కబీర్‌సింగ్.

ఇప్పుడు అంతకు మించిన క్రేజ్ యానిమల్‌లోనూ కనిపిస్తోంది. కేక రెస్పాన్స్ తెచ్చుకుంటోంది యానిమల్. ఆడియన్స్ పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. నెక్స్ట్ బాక్సాఫీస్ దగ్గర నెంబర్లను లెక్కపెట్టుకోవడమే తరువాయి.

యానిమల్ సక్సెస్‌తో సౌత్ కెప్టెన్ల మీద సీరియస్‌గానే ఫోకస్ చేస్తున్నారు నార్త్ హీరోలు. రీసెంట్‌గా షారుఖ్‌తో అట్లీ డైరక్ట్ చేసిన జవాన్ వేరే లెవల్లో హిట్ అయింది. వెయ్యి కోట్లను దాటి కలెక్ట్ చేసి వారెవా అట్లీ అనేలా చేసింది జవాన్.

కోవిడ్ టైమ్‌లో షేర్‌షా చేశారు విష్ణువర్ధన్. త్వరలో కరణ్‌జోహార్ సంస్థలో సల్మాన్‌ఖాన్ హీరోగా సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు నార్త్ లో సౌత్ కెప్టెన్లకున్న క్రేజ్, ఆల్రెడీ వాళ్ల ట్రాక్ రికార్డ్ అన్నీ కలిసి, ప్రాజెక్టుల మీద భరోసా పెంచేస్తున్నాయి.

షేర్షా డైరక్టర్ మాత్రమే కాదు, ఆకాశమే నీ హద్దురా డైరక్టర్ సుధ కొంగర మీద కూడా ఇప్పుడు బరువు మరింత పెరిగింది. ఆకాశమే నీ హద్దురా సినిమా హిందీ వెర్షన్ చేస్తున్నారు సుధ. అక్షయ్‌కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా మీద కూడా ఎక్స్ పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. వీళ్లతో పాటు ఫర్‌దర్‌గా నార్త్ లో మూవీస్ కమిట్ అయ్యే దక్షిణాది దర్శకుల మీద కూడా ఫ్లడ్‌లైట్స్ భారీగానే పడుతాయన్నది ఓపెన్ సీక్రెట్.




