AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tammudu Movie: ఏంటి తమ్ముడు ఇది.. మరీ ఇంత సైలెంట్ గా షూటింగ్ చేయాలా..?

ఈ రోజుల్లో ఉన్న సోషల్ మీడియా దెబ్బకు చీమ చిటుక్కుమన్నా కూడా సౌండ్ ఓ రేంజ్ లో వస్తుంది. అలాంటిది ఒక సినిమా మొదలుపెట్టి షూటింగ్ పూర్తి చేసిన సంగతి కూడా తెలియదు అంటే.. ఎంత జాగ్రత్త పడి ఉంటారు ఆ దర్శక నిర్మాతలు. ఇప్పుడు ఒక సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. ఓపెనింగ్ చేసిన విషయం తెలుసు.. రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టిన విషయం కూడా తెలుసు.. కానీ ఆ తర్వాత ఒక్క అప్డేట్ కూడా మీడియాకు ఇవ్వకుండా షూటింగ్ పూర్తి చేశారు ఒక సినిమా దర్శకుడు. ఇంతకు ఎవరాయనా అని ఆలోచిస్తున్నారు కదా.. ఆయనే ఎవరో కాదు వేణు శ్రీరామ్.

Praveen Vadla
| Edited By: Prudvi Battula|

Updated on: Nov 26, 2023 | 8:49 AM

Share
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత ఒకటి రెండు సినిమాలకు కమిట్ అయినట్లే కనిపించాడు ఈ దర్శకుడు. కానీ ఇటు అల్లు అర్జున్.. అటు రవితేజ లాంటి హీరోలు హ్యాండ్ ఇవ్వడంతో మళ్లీ ఖాళీ అయిపోయిన వేణు.. చివరికి నితిన్ హీరోగా ఒక సినిమాను మొదలు పెట్టాడు. దిల్ రాజు నిర్మాణంలో మొదలైన ఈ సినిమాకు తమ్ముడు అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.

1 / 5
అయితే పూజ కార్యక్రమాలు జరిగిన తర్వాత ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దాంతో సినిమా ఆగిపోయింది అనుకున్నారు చాలా మంది. కానీ అలాంటిదేమీ లేదు.. చాలా సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేశాడు వేణు శ్రీరామ్. ఒకవైపు వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, మరోవైపు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తూనే.. ఇంకోవైపు తమ్ముడు సినిమా షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు నితిన్.

2 / 5
ఈ సినిమా షూటింగ్ దాదాపు 70% పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఒకవైపు షూటింగ్ చేస్తూ.. డబ్బింగ్ కార్యక్రమాలు కూడా చూసుకుంటున్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్. అసలే మాత్రం సందడి లేకుండా ఇంత పెద్ద సినిమాను పూర్తి చేయడం అనేది చిన్న విషయం కాదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2024 ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కావడం ఖాయం.

3 / 5
దీనికి తమ్ముడు అనే టైటిల్ పెట్టడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు మరింత ఖుషి అవుతున్నారు. ఎందుకంటే పవన్ అభిమానుల్లో అందరికంటే ముందు వచ్చే ఫ్యాన్ నితిన్. తన ప్రతి సినిమాలో కచ్చితంగా పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ఉండేలా చూసుకుంటాడు ఈ హీరో. ఇప్పుడు ఏకంగా ఆయన టైటిల్ తోనే వస్తున్నాడు. దానికి తోడు తమ్ముడు సినిమాలోని ఒక పాటను ఇందులో రీమిక్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వకీల్ సాబ్ తర్వాత వేణును ఏ హీరో కూడా పట్టించుకోలేదు.. దానికి కారణం అది రీమేక్ కావడం.

4 / 5
అందుకే తమ్ముడు సినిమాతో హిట్టు కొట్టి తన రేంజ్ పెంచుకోవాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు. దానికి తోడు దిల్ తర్వాత నితిన్, దిల్ రాజు కాంబినేషన్లో వచ్చిన శ్రీనివాస కళ్యాణం అంచనాలు అందుకోలేదు. దాంతో తన మొదటి హీరో ఫ్లాప్ బాకీ తీర్చుకోవాలని చూస్తున్నాడు రాజు. కచ్చితంగా తమ్ముడు సినిమాతో హిట్టు కొట్టి నితిన్ కు గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ సినిమా విజయం హీరో, నిర్మాత కంటే దర్శకుడికి చాలా ముఖ్యం. ఏదేమైనా కూడా ఈ రోజుల్లో ఇంత సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేయడం అనేది మాత్రం చిన్న విషయం కాదు. అందులో వేణు శ్రీరామ్ కు నూటికి నూరు మార్కులు వేయాల్సిందే. 

5 / 5