Nani31: తనకి ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో నాని మరో చిత్రం.. కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్..

సాధారణంగా ఓ ఫ్లాప్ డైరెక్టర్‌తో సినిమా అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంటారు హీరోలు.. పైగా ఆ దర్శకుడు తమకే ఫ్లాప్ ఇస్తే కాస్త డిస్టేన్స్ మెయింటేన్ చేస్తారు. కానీ నాని మాత్రం పోయిన చోటే వెతుక్కుంటున్నారు. ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితోనే మళ్ళీ హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు న్యాచురల్ స్టార్. తాజాగా ఈయన నెక్ట్స్ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఓ సినిమా పూర్తైన వెంటనే మరోటి సెట్స్‌పైకి వెళ్లేలా చూసుకుంటారు న్యాచురల్ స్టార్. 

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Prudvi Battula

Updated on: Oct 22, 2023 | 12:14 PM

సాధారణంగా ఓ ఫ్లాప్ డైరెక్టర్‌తో సినిమా అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంటారు హీరోలు.. పైగా ఆ దర్శకుడు తమకే ఫ్లాప్ ఇస్తే కాస్త డిస్టేన్స్ మెయింటేన్ చేస్తారు. కానీ నాని మాత్రం పోయిన చోటే వెతుక్కుంటున్నారు. ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితోనే మళ్ళీ హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు న్యాచురల్ స్టార్. తాజాగా ఈయన నెక్ట్స్ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.

1 / 5
నాని స్పీడ్‌కు మిగిలిన హీరోలు జడుసుకుంటున్నారు. అసలెలా మ్యానేజ్ చేస్తున్నారో తెలియదు కానీ ఓ సినిమా పూర్తైన వెంటనే మరోటి సెట్స్‌పైకి వెళ్లేలా చూసుకుంటారు న్యాచురల్ స్టార్. అలాగని ఒకేసారి రెండు సినిమాలు చేయరు.. కన్ఫ్యూజ్ అవ్వరీయన. మెల్లగా ఓ రిలీజ్ తర్వాత.. మరోటి ప్లాన్ చేస్తుంటారు. హాయ్ నాన్న రిలీజ్‌కు రెడీ అవుతున్న వేళ.. నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది.

2 / 5
హాయ్ నాన్న డిసెంబర్ 7న విడుదల కానుంది. శౌర్యు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇది పూర్తిగా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. దీనికి ముందు కూడా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో దసరా చేసి హిట్ కొట్టారు. తాజాగా వివేక్ ఆత్రేయతో తన ప్రాజెక్ట్ ప్రకటించారు నాని. ఇది డార్క్ యాక్షన్ థ్రిల్లర్. అంటే సుందరానికి తర్వాత ఈ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది.

3 / 5
అంటే సుందరానికి కమర్షియల్‌గా అంచనాలు అందుకోకపోయినా.. నానికి చాలా ఇష్టమైన సినిమా. అందుకే వివేక్ ఆత్రేయతో వెంటనే మరో సినిమాకు ఓకే చెప్పారు. డివివి దానయ్య నిర్మాణంలో ఈ సినిమా రాబోతుంది.

4 / 5
తాజాగా టెస్ట్ కట్ వీడియో రిలీజ్ చేసారు మేకర్స్. అక్టోబర్ 24న ముహూర్తం పెట్టారు. దసరా తర్వాత షూటింగ్ మొదలు కానుంది. మొత్తానికి ఫ్లాపిచ్చిన దర్శకుడితోనే హిట్ కొట్టాలని చూస్తున్నారు నాని.

5 / 5
Follow us