- Telugu News Photo Gallery Cinema photos Mangalavaram to Nayagan Latest movie news from cinema industry
Film Updates: మంగళవారం ట్రైలర్ విడుదల.. రీరిలీజ్ కానున్న కమల్ చిత్రం..
ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా మంగళవారం. లాఠీ, రాజరాజచోరతో పాటు మరికొన్ని సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సునయన. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా మనీష్ శర్మ తెరకెక్కిస్తున్న సినిమా టైగర్ 3. నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో మరో సినిమా వచ్చేస్తుంది. కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన ఆల్ టైమ్ క్లాసిక్ సినిమా నాయకుడు.
Updated on: Oct 22, 2023 | 11:56 AM

ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా మంగళవారం. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తుంది. ఇందులో పాయల్ రాజ్‌పుత్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

లాఠీ, రాజరాజచోరతో పాటు మరికొన్ని సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సునయన. తాజాగా ఈమె రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ యాక్సిడెంట్‌లో సునయనకు కొన్ని గాయాలయ్యాయి. ప్రస్తుతం హాస్పిత్రిలో చికిత్స తీసుకుంటున్నారు ఈమె. త్వరలోనే బయటికి రానున్నట్లు చెప్పారు.

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా మనీష్ శర్మ తెరకెక్కిస్తున్న సినిమా టైగర్ 3. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 13న విడుదల కానుంది. దివాళి సందర్భంగా సినిమాను విడుదల చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ చిత్రంలోని కత్రినా కైఫ్ ఫస్ట్ లుక్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు.

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో మరో సినిమా వచ్చేస్తుంది. ఆల్రెడీ వీళ్ళిద్దరూ 'అంటే సుందరానికి' సినిమా చేశారు. ఈ సినిమాకు ఊహించిన రెస్పాన్స్ అయితే రాలేదు. అయినా కూడా వివేక్ కథ నచ్చి మరో ఛాన్స్ ఇచ్చారు నాని. ఈ సినిమాకు సరిపోదా శనివారం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన ఆల్ టైమ్ క్లాసిక్ సినిమా నాయకుడు. ఈ సినిమాను మరోసారి విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే నవంబర్ 3న నాయకుడు 4K వర్షన్ విడుదల కాబోతుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు మేకర్స్. కాగా త్వరలోనే మణిరత్నం, కమల్ కాంబినేషన్‌లో సినిమా రానుంది.




