బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన భగవంత్ కేసరి సినిమాకు మొదటి రోజు 32 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. అన్నిచోట్లా ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుందంటూ చిత్రయూనిట్ ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓవర్సీస్‌లో 1 మిలియన్ వైపు పరుగులు తీస్తుంది. అఖండ, వీరసింహారెడ్డి తర్వాత వరసగా మూడోసారి మిలియన్ మార్క్ అందుకున్నారు బాలయ్య.