- Telugu News Photo Gallery Cinema photos Movies and series that are set to make buzz on OTT this week
OTT Releases: డాకు మహారాజ్ టూ క్రైమ్ బీట్.. ఈ వారం ఓటీటీలో సందడికి ఇవి సిద్ధం..
ప్రతివారం డిజిటల్ వేదిక చాలా సిరీసులు, సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. వాటిని ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. అయితే డాకు మహారాజ్ సినిమా నుండి క్రైమ్ బీట్ సిరీస్ వరకు ఈ వారం ఓటీటీలో విడుదల కానున్నవి ఏంటి.? ఎప్పుడు స్ట్రీమ్ అవుతున్నాయి.? ఈరోజు మనం తెలుసుకుందాం రండి..
Updated on: Feb 20, 2025 | 4:08 PM

వరుణ్ ధావన్, వామికా గబ్బి, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో రూపొందిన బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ 'బేబీ జాన్'. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఫిబ్రవరి 19 నుంచి హిందీతో పాటు తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. సల్మాన్ ఖాన్, సన్యా మల్హోత్రా, జాకీ ష్రాఫ్, రాజ్‌పాల్ యాదవ్ ఇందులో నటించారు.

నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలు పోషించిన యాక్షన్ డ్రామా చిత్రం 'డాకు మహారాజ్'. ఈ ఏడాది సంక్రాంతికి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 21 నుంచి అందుబాటులోకి రానుంది.

సీమా దేశాయ్ దర్శకత్వం వహించిన 'కౌశల్జీస్ వర్సెస్ కౌశల్' చిత్రంలో అశుతోష్ రానా, షీబా చద్దా, పావైల్ గులాటి, ఇషా తల్వార్, బ్రిజేంద్ర కాలా కీలక పాత్రల్లో నటించారు. ఇది జియో హాట్ స్టార్ వేదికగా ఈ నెల 21 నుంచి స్ట్రీమ్ కానుంది.

శ్వేతా బసు ప్రసాద్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ కామెడీ డ్రామా సిరీస్ 'ఊప్స్! అబ్ క్యా?' జియో హాట్ స్టార్ వేదిక ఫిబ్రవరి 20న ప్రసారం అవుతుంది. ఇందులో ఆషిమ్ గులాటీ, అభయ్ మహాజన్, అపరా మెహతా, జావేద్ జాఫేరి, సోనాలి కులకర్ణి, అమీ ఏలా తదితరులు నటించారు.

సాకిబ్ సలీం, సబా ఆజాద్ నటించిన బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'క్రైమ్ బీట్'. ఈ మూవీలో రాహుల్ భట్, సాయి తంహంకర్, డానిష్ హుస్సేన్, ఆదినాథ్ కొఠారే, రాజేష్ తైలాంగ్, రణవీర్ షోరే ఇతర పాత్రధారులు. ఇది ఈ నెల 21న జీ5లో విడుదల కానుంది.

కబీజ్ దర్శకత్వంలో గురు లక్ష్మణ్ శబరీష్, స్మేహా, కీర్తివేల్, కెమీ, పరంధామన్, తమిజ్వానీ, సరితిరన్, శివ అరవింద్, చిలిపివాడు రఘు, TSR తమిళ కామెడీ సిరీస్ 'ఆఫీస్'. ఇది జియో హాట్ స్టార్ లో ఈ నెల 21 నుంచి సందడి చేయనుంది.




